ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE: ప్రవాసులూ బీకేర్‌ఫుల్.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.. లేకుంటే రూ.4లక్షల జరిమానా కట్టాల్సిందే!

ABN, First Publish Date - 2022-09-18T16:50:02+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)లో ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)లో ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ట్రాఫిక్ నిబంధనలు (Traffic rules) బ్రేక్ చేస్తే మాత్రం అంతే సంగతులు. భారీ జరిమానాలు, కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అనుసరించే యూఏఈ ట్రాఫిక్ పోలీస్ విభాగం (UAE Traffic police department) తాజాగా మరో కొత్త ప్రపొజల్‌ను అమలు చేసే విషయమై పబ్లిక్ ప్రాసిక్యూషన్‌‌ను సంప్రదించింది. ఏవరైనా వాహనదారులు యాక్సిడెంట్ చేసిన తర్వాత ప్రమాదస్థలి నుంచి తప్పించుకుంటే.. అది కూడా బాధితులకు తీవ్ర గాయాలైన సందర్భంలో. 


దీంతో ఇకపై ఇలాంటి సందర్భాల్లో వాహనదారుడికి 20వేల దిర్హమ్స్(రూ.4లక్షలు) వరకు జరిమానా విధించవచ్చని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఈ మేరకు తాజాగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ (Public Prosecution) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. "ప్రమాదానికి కాణమైన వాహనదారుడు.. బాధితులకు గాయాలైన సందర్భంలో పట్టించుకోకుండా ప్రమాదస్థలి నుంచి తప్పించుకుంటే 20వేల దిర్హామ్ల జరిమానా ఉంటుంది. అలాగే ప్రమాద తీవ్రతను బట్టి వాహనదారుడు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది" అని హెచ్చరించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన 1995లో తీసుకొచ్చిన ఫెడరల్ చట్టం నం. 21లోని ఆర్టికల్-49లో గల క్లాజ్-5 ప్రకారం ఈ జరిమానా విధించడం జరుగుతుందని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.   

Updated Date - 2022-09-18T16:50:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising