ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America: బోస్టన్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమ 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం

ABN, First Publish Date - 2022-09-06T16:58:10+05:30

అమెరికా పర్యటనలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు బోస్టన్ వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోస్టన్‌: అమెరికా పర్యటనలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు బోస్టన్ వెళ్లారు. ఈ సంధర్భంగా ఎన్నారై టీడీపీ బోస్టన్ (NRI TDP Boston) విభాగం నిర్వహంచిన మీట్ & గ్రీట్ కార్యక్రమానికి హాజరై అభిమానులు, సానుభూతిపరులతో  సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి 150 మందికి  పైగా టీడీపీ (TDP) అభిమానులు విచ్చేసి అన్న ఎన్టీఆర్, విషనరీ లీడర్ చంద్రదబాబు, కృషీవలుడు ఉమాగార్లపై వారి అచంచలమైన అభిమానాన్ని చాటారు.


ఆంధ్ర అభివృద్ధి కోసం ఐదు సంవత్సరాల పాటు అవిశ్రాంతిగా తెలుగు దేశం ప్రభుత్వం చేసిన కృషిని సభ్యులకు మాజీ మంత్రి వివరించారు. ఎన్నారైలు కూడా తమ నియోజకవర్గాలలో బూత్ లెవెలో ఓటర్ వెరిఫికేషన్ చేయంచాలని, స్వింగ్ ఓటర్లను ప్రభావితం చేసేలా ఇప్పటి నుంచే క్రమపద్ధతిలో కార్యాచరణ చేయ్యలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నారైటీడీపీ.కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. 


తెలుగు తమ్ముళ్లు మాట్లాడుతూ.. వారం వారం పోలవరం అంటూ ఆంధ్రాలోని ప్రతి సీమకు నీరు అందించాలని పట్టుబట్టి పట్టి సీమను పూర్తి చేసి, పోలవరం పూర్తికై పరుగులు పెట్టించిన ఆంద్రా భగీరథుడు దేవినేని ఉమామహేశ్వర్రావు అని కొనియాడారు. దేవినేని సన్మానించాలని తమ్ముళ్లు సంకల్పించారు. అయితే, ఆయన నాకు కాదు ఇక్కడకు విచ్చేసిన 83 సంవత్సరాల పెద్దమ్మను మనం సన్మానించాలని అందరిని దగ్గరికి పిలిచి ఒక అమ్మను గౌరవ సత్కారం చేశారు. ఇది టీడీపీ (TDP) సంస్కారం అని అనడంలో అతిశయోక్తి లేదు. అన్న ఎన్‌టీఆర్ (NTR), చంద్రదన్న నేర్పిన TDP క్రమశిక్షణ అందరిని ఆకట్టుకుంది.


చరిత్రలో యదార్ధ గాథలో చదివి ఉన్నాము.. అబద్ధాల పునాదులపై నిర్మించిన కోటలు భీటలు వరకు తప్పదు. ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణం కోసం, అమరావతి నగరాన్ని భూతలంపై ఆవిష్కరించడం కోసం, పోలవరాన్ని భారతావనికి ఒక వరంగా ఇచ్చేందు తెలుగుదేశం రావాలి.. మన దశ దిశ మారాలని ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు ఆకాక్షించారు.

Updated Date - 2022-09-06T16:58:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising