ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Florida లో కొత్త వలసదారుల చట్టం.. లక్షల మంది అక్రమంగా దేశంలోకి వస్తున్నారంటూనే..

ABN, First Publish Date - 2022-06-21T00:51:30+05:30

ఫ్లోరిడా రాష్ట్రంలో(అమెరికా) అక్రమవలసలను నిరోధించే కొత్త బిల్లుకు రాష్ట్ర గవర్నర్ రాన్ డిషాంటిస్ తాజాగా తన ఆమోదముద్ర వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఫ్లోరిడా రాష్ట్రంలో(అమెరికా) అక్రమవలసలను నిరోధించే కొత్త బిల్లుకు రాష్ట్ర గవర్నర్ రాన్ డిషాంటిస్ తాజాగా తన ఆమోదముద్ర వేశారు. ఆయన సంతకంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ చట్టం ప్రకారం.. రాష్ట్రంలోకి విదేశీయులను అక్రమంగా తరలించే రవాణా కంపెనీలకు ప్రభుత్వం ఎటువంటి కాంట్రాక్టులూ మంజూరు చేయకూడదు. 


ఇక దేశంలోకి విదేశీయుల అక్రమరవాణా పెచ్చుమీరుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసే డిషాంటిస్..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అనురిస్తున్న విధానాలపై విమర్శలు గుప్పిస్తుంటారు. సరిహద్దుల భద్రత విషయంలో బైడెన్ విధానాలు పేలవంగా ఉన్నాయంటూ మండిపడుతుంటారు. ‘‘ఇక్కడ అక్రమ వలసదారుల సంఖ్య చూస్తే ఎవ్వరైనా షాకైపోవాల్సిందే. వీరి సంఖ్య లక్షల్లో ఉందంటే..ఏకంగా భారీ నగరాలనే అమెరికాకు తరలిస్తున్నట్టు భావించాలి. ఇది చాలా సమస్యాత్మకం.’’ అంటూ డిషాంటిన్ వలసల నిరోధక బిల్లుపై సంతకం చేస్తూ వ్యాఖ్యానించారు. ఫ్లోరిడా రాష్ట్రంలో మనుషుల అక్రమరవాణాపై గ్రాండ్ జ్యూరీతో విచారణ చేపట్టాలని ఆయన రాష్ట్ర సుప్రీం కోర్టును కూడా అభ్యర్ధించారు. 


మరోవైపు.. వలసలపై ఉక్కుపాదం తప్పదంటూ ఎలుగెత్తుతున్న డిషాంటిస్‌కు మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభిమానుల మద్దతు కూడా లభిస్తోంది. అప్పటి అధ్యక్షుడి రేసులో ట్రంప్‌కు ఆర్థికసాయం అందించిన అనేక మంది ప్రస్తుతం డిషాంటిస్‌ వైపు మొగ్గు చూపుతున్నారని స్థానిక మీడియా చెబుతోంది. 

Updated Date - 2022-06-21T00:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising