ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: ఇంట్లో పని విషయంలో గొడవ.. భారతీయురాలిని చంపేసిన Ethiopian పనిమనిషి.. ఉరిశిక్ష వేసిన కోర్టు!

ABN, First Publish Date - 2022-05-25T16:44:01+05:30

కువైత్‌లోని అబ్దుల్లా అల్ ముబారక్ శివారులో తన సహోద్యోగిని అయిన భారతీయురాలిని కత్తితో పొడిచి చంపినందుకు Ethiopian పనిమనిషికి దిగువ కోర్టు ఉరిశిక్ష విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్‌లోని అబ్దుల్లా అల్ ముబారక్ శివారులో తన సహోద్యోగిని అయిన భారతీయురాలిని కత్తితో పొడిచి చంపినందుకు Ethiopian పనిమనిషికి దిగువ కోర్టు ఉరిశిక్ష విధించింది. తాజాగా దిగువ కోర్టు తీర్పును అప్పీల్ కోర్టు కూడా సమర్థించింది. దీంతో సదరు ఇథియోపియన్ గృహ కార్మికురాలికి మరణ శిక్ష ఖాయమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతేడాది రంజాన్ మాసంలో కువైత్‌లోని అబ్దుల్లా అల్ ముబారక్ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి వద్ద భారతీయురాలితో పాటు ఇథియోపియన్ మహిళ కూడా ఇంట్లో పని చేసేవారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పని విషయంలో తెలెత్తిన ఘర్షణ కాస్తా చంపుకునే వరకు వెళ్లింది. Ethiopian మహిళ భారత గృహ కార్మికురాలిని కత్తితో పొడిచి చంపేసింది. దాంతో తన ఇద్దరు ఇంటి పనివారు గొడవ పడ్డారని, వారిలో ఒకరు చనిపోయినట్లు యజమాని.. అంతర్గత మంత్రిత్వ శాఖలోని ఆపరేషన్స్ యూనిట్‌కు ఫోన్ ద్వారా తెలిజేశారు.


యజమాని సమాచారంతో రంగంలోకి దిగిన ఫర్వానియా దర్యాప్తు అధికారులు ఇథియోపియన్‌ను అల్-బలాగ్ ప్రాంతంలో అరెస్టు చేశారు. అక్కడే ఆమె భారతీయ గృహ కార్మికురాలిని చంపడానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం. విచారణలో నిందితురాలు తన సహోద్యోగిని హత్య చేసినట్లు అంగీకరించింది. వంటగదిలో పని పంపిణీ విషయంలో తనకు, బాధితురాలికి మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఈ సంఘటన జరిగిందని ఆమె అధికారులకు తెలియజేసింది. వెంటనే Ethiopian ను అధికారులు కువైత్ కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానంలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. దాంతో కోర్టు ఆమెకు మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా ఈ కేసు అప్పీల్ కోర్టులో విచారణకు వచ్చింది. అప్పీల్ కోర్టు సైతం దిగువ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సమర్థించింది.  

Updated Date - 2022-05-25T16:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising