ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఎస్-కెనడా బోర్డర్‌లో చనిపోయిన భారతీయ కుటుంబం.. అంత్యక్రియలపై కుటుంబ సభ్యుల కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-01-30T00:06:56+05:30

అమెరికాలోకి ప్రవేశిస్తూ యూఎస్, కెనడా సరిహద్దుల్లో మరణించిన భారతీయుల అంత్యక్రియల విషయంలో వారి కుటుంబ కీలక వ్యాఖ్యలు చేశారు. మృతదేహాలను స్వగ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలోకి ప్రవేశిస్తూ యూఎస్, కెనడా సరిహద్దుల్లో మరణించిన భారతీయుల అంత్యక్రియల విషయంలో వారి కుటుంబ కీలక వ్యాఖ్యలు చేశారు. మృతదేహాలను స్వగ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం లేదని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తూ ఈ నెల 19న గుజరాత్‌కు చెందిన జగదీష్ బల్దేవ్‌భాయ్ పటేల్(39) అతని భార్య వైశాలిబెన్ పటేల్(37), కూతురు విహాంగి పటేల్ (11), కుమారుడు ధార్మిక్ పటేల్(03) మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. బుధవారం వీరి మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తవగా.. తర్వాత జరగాల్సిన కార్యక్రమాల కోసం కెనడాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం మృతుల కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే జగదీష్ పటేల్ కజీన్ జశ్వంత్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మృతదేహాలను ఇండియాకు తీసుకురాకూడదని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘మేమంతా ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. అందరం కలిసి చర్చించుకున్న తర్వాత మృతదేహాలను ఇండియాకు తీసుకురాకూడదనే నిర్ణయానికి వచ్చాం. కెనడాలోనే అంత్యక్రియలు జరగాలని అనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. 




Updated Date - 2022-01-30T00:06:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising