ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Duabi: గల్ఫ్‌లో తొలి దళిత బహుజన సభకు ఏర్పాట్లు

ABN, First Publish Date - 2022-08-05T13:23:38+05:30

విదేశీగడ్డపై తొలిసారిగా తెలంగాణ దళితుల కోసం దుబాయిలో అలయ్‌ బలయ్‌ ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి ప్రవాసీయులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): విదేశీగడ్డపై తొలిసారిగా తెలంగాణ దళితుల కోసం దుబాయిలో అలయ్‌ బలయ్‌ ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి ప్రవాసీయులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలోని విద్యాధికులైన దళిత బహుజనులను ఆకర్షిస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌పై విదేశాలలో ఉంటున్న ఈ వర్గపు ప్రవాసీయులకు ప్రత్యేక అభిమానం ఉంది. ఈ తరుణంలో ప్రవీణ్‌ కుమార్‌ ఈ నెల 15 నుంచి అమెరికాలో నెల రోజుల పాటు పర్యటించనున్నారు. అమెరికాకు వెళ్తూ మార్గమధ్యలో దుబాయిలో ఒక రోజు ముందు గల్ఫ్‌లో ప్రవాసీయుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. దుబాయిలోని అల్‌ ఖోజ్‌లో డలస్కో మీటింగ్‌ హాలులో 14న మధ్యాహ్నం ఒంటి గంటలకు ఈ సమ్మేళనాన్ని నిర్వహించననున్నట్లుగా నిర్వాహకులు చాకలి వెంకట్‌, మహతి రమేశ్‌లు  తెలిపారు.  

Updated Date - 2022-08-05T13:23:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising