ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ఒంటరి జీవితాల్లో వెలుగులు నింపిన కార్చిచ్చు!

ABN, First Publish Date - 2022-01-27T02:23:13+05:30

ఇద్దరి ఇళ్ల మధ్య దూరం కేవలం రెండు కిలోమీటర్లే. అయినా ఆ ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి తెలియదు. ఒంటరి జీవితాన్ని భారంగా గడుపుతున్న క్రమంలో చోటు చేసుకున్న ఓ ప్రమాదం తొలుత వారి మధ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఇద్దరి ఇళ్ల మధ్య దూరం కేవలం రెండు కిలోమీటర్లే. అయినా ఆ ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి తెలియదు. ఒంటరి జీవితాన్ని భారంగా గడుపుతున్న క్రమంలో చోటు చేసుకున్న ఓ ప్రమాదం తొలుత వారి మధ్య దూరాన్ని తగ్గించింది. ఆ తర్వాత వారి మనసులు దగ్గరయ్యాయి. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి ఒకటిగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. వీళ్ల లవ్‌స్టోరీపై ఓసారి లుక్కేస్తే..


అతడి పేరు టిమ్ వారెన్. వయసు మీదపడటం వృద్ధాప్య లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె పేరేమో హోలీ ష్లంఫ్. ఈమె మాత్రం మధ్య వయసు మహిళలా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అంతేకాకుండా కాలిఫోర్నియాలోని ఒకే ఏరియాలో నివసిస్తున్నా.. ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి తెలియదు. అయితే గత ఏడాది కాలిఫోర్నియాను వణికించిన కార్చిచ్చు.. ఇద్దరినీ ఒకే చోటుకు చేర్చింది. వారెన్, హోలీ నివసిస్తున్న ప్రాంతాన్ని కార్చిచ్చు కమ్మేసింది. ఈ నేపథ్యంలో అందరితోపాటే అధికారులు వారెన్, హోలీని కూడా కూడా కామెరాన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి గృహాలకు తరలించారు. దీంతో వారెన్, హోలీల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం తర్వాత ప్రేమగా మరింది. దీంతో తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలో వివాహం చేసుకుని.. ఇద్దరూ కలిసి ఒకటిగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు రెడీ అయ్యారు. 


ఈ సందర్భంగా వారెన్ మాట్లాడుతూ.. హోలీ పరిచయం తర్వాత తన జీవితం బాగుందని పేర్కొన్నాడు. హోలీ మాట్లాడుతూ.. తమ లవ్‌స్టోరీకి ఎలా పునాదులు పడ్డాయో వివరించింది. మోకాలిపై కూర్చుని వారెనే తనకు లవ్ ప్రపోజ్ చేసినట్టు తెలిపింది. దీంతో వెంటనే తాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశానని ఆనందం వ్యక్తం చేసింది. 




Updated Date - 2022-01-27T02:23:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising