ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: పారిపోతున్న భార్యను వెంటాడి మరీ చితకబాదిన భర్త.. వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు అతడి పరిస్థితి ఏంటంటే..

ABN, First Publish Date - 2022-09-17T17:43:56+05:30

కువైత్‌లో (Kuwait) జరిగిన ఓ సంఘటన దానికి తాలూకు వీడియో వైరల్ కావడంతో ఓ ప్రభుత్వాధికారిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కువైత్‌లో (Kuwait) జరిగిన ఓ సంఘటన దానికి తాలూకు వీడియో వైరల్ కావడంతో ఓ ప్రభుత్వాధికారిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. జబేర్ అల్ అహ్మద్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వీడియోలోని దృశ్యాల ఆధారంగా రంగంలోకి దిగిన కువైత్ పోలీసులు (Kuwait Police) ఆ అధికారిని ఇంటికెళ్లి మరీ అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి తరలించారు. ఇంతకు ఆ వీడియోలో ఏముంది? ఆ  ప్రభుత్వాధికారి చేసిన నేరం ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఓ మహిళ వెళ్తున్న కారును మరో కారులో వచ్చిన వ్యక్తి అడ్డగించడం వీడియోలో ఉంది. అనంతరం కారులోంచి దిగిన ఆ వ్యక్తి తన కారు డిక్కీలోంచి ఓ ఇనుప రాడు తీసుకుని మహిళ కారు అద్దాలను పగలగొట్టాడు. దాంతో అందులో ఉన్న మహిళ కారు దిగి పరుగు అందుకుంది. అదిగమనించిన ఆ వ్యక్తి ఆమెను వెంటాడు. కొంతదూరం వెళ్లాక దొరికించుకుని చితకబాదాడు. అది గమనించిన పక్కనే ఉన్నవారు అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై విరుచుకుపడ్డాడు. 


ఆమె తన భార్య అని, ఇది తమ పర్సనల్ గొడవ అంటూ ఆమెను కిందపడేసి కొట్టడం చేశాడు. అయితే, అక్కడ జనం ఎక్కువ కావడం గమనించిన అతడు ఆమెను వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోవడం వీడియోలో రికార్డైంది. ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో వైరల్ కావడం, పోలీసుల దృష్టికి వెళ్లడం జరిగింది. దాంతో పోలీసులు వీడియోలోని దృశ్యాల ఆధారంగా సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని అగ్నిమాపకశాఖలో పనిచేస్తున్న ప్రభుత్వాధికారిగా గుర్తించారు. అనంతరం అతడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీస్‌కు తరలించారు. 

Updated Date - 2022-09-17T17:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising