ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా కీలక నిర్ణయం.. విదేశీ ప్రయాణికులకు భారీ ఉపశమనం!

ABN, First Publish Date - 2022-06-29T22:31:07+05:30

విదేశీ ప్రయాణికులకు డ్రాగన్ కంట్రీ.. భారీ ఉపశమనం ఇచ్చింది. కొవిడ్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్న వాళ్లకు కూడా కొత్త మార్గదర్శకాల ప్రకారం క్వారెంటైన్ నిబంధనలు వర్తిస్తాయని తేల్చి చెప్పింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: విదేశీ ప్రయాణికులకు డ్రాగన్ కంట్రీ.. భారీ ఉపశమనం ఇచ్చింది. కొవిడ్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్న వాళ్లకు కూడా కొత్త మార్గదర్శకాల ప్రకారం క్వారెంటైన్ నిబంధనలు వర్తిస్తాయని తేల్చి చెప్పింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


జీరో కొవిడ్ పాలసీలో భాగంగా మొన్నటి వరకూ షాంఘై వంటి కొన్ని నగరాల్లో కఠిన నిబంధనలు అమలు చేసిన చైనా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా.. ఇకపై విదేశీ ప్రయాణికులు చైనాకు చేరుకున్న తర్వాత కేవలం 7 రోజులపాటు తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉంటే సరిపోతుందని చెప్పింది. ఆ తర్వాత మూడు రోజులపాటు ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలని తెలిపింది. కొవిడ్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని చైనా ప్రభుత్వం వెల్లడించింది. అంతకుముందు విదేశీ ప్రయాణికులకు తప్పనిసరి క్వారెంటైన్ పీరియడ్ 21 రోజులు (ఇంట్లో స్వీయ పర్యవేక్షణతో కలిపి) ఉండేది. చైనా ప్రభుత్వ తాజా నిర్ణయంతో.. విదేశీ ప్రయాణికులకు భారీ ఉపశమనం లభించినట్టైంది. ఇదిలా ఉంటే.. వరల్డ్ఒమీటర్‌లోని సమాచారం ప్రకారం.. చైనాలో ప్రస్తుతం 464 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. 




Updated Date - 2022-06-29T22:31:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising