ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బే ఏరియాలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

ABN, First Publish Date - 2022-04-21T13:44:08+05:30

అమెరికాలోని కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఎన్నారై సభ్యులు వెంకట్ కోగంటి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఎన్నారై సభ్యులు వెంకట్ కోగంటి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. అలుపెరగని చంద్రబాబు పోరాటం స్పూర్తిదాయకమని  అన్నారు. అతడే ఒక సైన్యం, అతడే ఒక ప్రేరణ సరికొత్త లక్ష్యాల తీరాల వెంట ఎగిరే విహంగం. అందుకే ఆధునిక సాంకేతికత, జాతి నిర్మాణం వైపు తెలుగు ప్రజలను జాగృతం చేశారని కొనియాడారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో చంద్రబాబు అనేకమైన జయాపజయాలు, ఎత్తుపల్లాలు చవిచూసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. నేతి తరం రాజకీయ నాయకులు అనేక పాఠాలు ఆయన నుంచి నేర్చుకోవాలి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ కాలం పని చేసి, అధికార పక్షం లేదా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షాన పోరాడారన్నారు. 


ఎన్నారై సభ్యులు వెంకట్ కోగంటి మాట్లాడుతూ.. ఓ పల్లెటూరి కుర్రాడు చదువులో ఉత్తీర్ణుడై, విద్యార్థి లోకానికి నాయకుడై, ప్రజా బాహుళ్యానికి ప్రతినిధియై, మహా ప్రభంజనమై ముందుకురికిన ఒక ప్రజాధరణ పార్టీకి ఇరుసుగా ఎదిగారు అని ప్రశంసించారు. తెలుగు ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా తన దార్శనిక పాలనతో జనరంజక నేత అయ్యారన్నారు. 


ఎన్నారై సభ్యులు భక్త బల్లా మాట్లాడుతూ.. చంద్రబాబు తన విజన్ ద్వారా హైదరాబాద్ లాంటి మహా నగరాన్ని నిర్మించారని తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి లెక్కకు మించి ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారన్నారు. తెలుగు ప్రజల ఉజ్వల భవితకు మార్గదర్శకునిగా ఉండేలా మల్చిన సామాజిక శిల్పి చంద్రబాబు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై సభ్యులు శ్రీనివాస్ వల్లూరిపల్లి, సుబ్బా యంత్రా, శ్రీనివాస్ తడపనేని, గంధి పాపినేని, వాసు బండ్ల, భాస్కర్ మన్నవ, భాస్కర్ వల్లభనేని, హర్ష యడ్లపాటి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-04-21T13:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising