ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI TDP EUROPE ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

ABN, First Publish Date - 2022-04-20T21:01:59+05:30

తెలుగు ప్రజల ప్రియతమ నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 72వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. యూకేలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పలు నగరాల్లో‌ అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలను నిర్వహిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తెలుగు ప్రజల ప్రియతమ నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 72వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. యూకేలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పలు నగరాల్లో‌ అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. యూకేలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు, విద్యార్థులు, ఐటి ఉద్యోగులు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ తమ అనుభవాలను పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.



ఈ కార్యక్రమంలో చంద్రబాబు చిన్ననాటి స్నేహితులు మునిరత్నం నాయుడు పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి, అంచెలంచెలుగా చంద్రబాబు ఎలా ఎదిగారో అందరికీ తెలియజేశారు. జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ‘జై బాబు.. జై జై బాబు’ అంటూ నినాదాలు చేశారు. ‘చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి’ అంటూ ఆయన నాయకత్వాన్ని బలపరిచారు. అలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లి, మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకున్నారు. ఈ వేడుకను జయకుమార్ గుంటుపల్లి, వేణు మాధవ్ పోపూరి, కిరణ్ పరుచూరి, ప్రసన్న నాదెండ్ల, నరేష్ మల్లినేని, శ్రీనివాస్ పాలడుగు, తదితరులు నిర్వహించారు.




Updated Date - 2022-04-20T21:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising