ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌లో Netflix కలకలం.. నిషేధించాలంటూ కేసు!

ABN, First Publish Date - 2022-02-02T14:57:28+05:30

గల్ఫ్ దేశం కువైత్‌లో నెట్‌ఫ్లిక్స్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ నిర్మించి, విడుదల చేసిన అరబిక్ మూవీ 'పెర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్' దీనికి కారణం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో నెట్‌ఫ్లిక్స్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ నిర్మించి, విడుదల చేసిన అరబిక్ మూవీ 'పెర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్' దీనికి కారణం. ఈ సినిమా నైతిక విలువలను తుంగలో తొక్కిందని ఆరోపిస్తూ అటార్నీ అబ్దులాజీజ్ అల్ సుబై హైకోర్టులో కేసు వేశారు. వెంటనే దేశవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌ను బ్యాన్‌ చేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని విన్నవించారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (సీఐటీఆర్ఏ) మినిస్ట్రీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసు తదుపరి విచారణ మే 25న జరగనుంది. ఇక నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేసిన 'పెర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్' చిత్రంలోని సన్నివేశాలు నైతిక విలువలను పతనం చేసేలా ఉన్నాయని అక్కడి ప్రజలు సైతం ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న యువకులు అది అందించే ఇలాంటి తప్పుడు కంటెంట్‌ల ద్వారా వారు ప్రభావితమవుతారని ఈ సందర్భంగా న్యాయవాది అల్ సుబై పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-02T14:57:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising