ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: కెనడా యువతి వైరల్ వీడియో.. తన భారతీయ బాయ్‌ఫ్రెండ్‌ను సర్‌ప్రైజ్ చేయాలని..

ABN, First Publish Date - 2022-08-31T01:49:45+05:30

ఇక భిన్న దేశాలు, సంస్కృతులకు చెందిన వారు ప్రేమికులుగా మారుతున్న ఈ రోజుల్లో బహుమతుల స్వరూపస్వభావాలు కూడా మారుతున్నాయి. ఇందుకు తాజాగా ఉదాహరణే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం కామన్. మనసుపడ్డ వారిని సర్‌ప్రైజ్ చేసేందుకు యువతీయువకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వాచ్‌లు, ఆభరణాలు వంటివాటిని బహుమతులుగా ఇస్తే మరకొందరు ఊహించని విధంగా విహారయాత్రలు గట్రా ప్లాన్ చేసి ఆశ్చర్యపరుస్తుంటారు. ఇక భిన్న దేశాలు, సంస్కృతులకు చెందిన వారు ప్రేమికులుగా మారుతున్న ఈ రోజుల్లో బహుమతుల స్వరూపస్వభావాలు కూడా మారుతున్నాయి. ఇందుకు తాజాగా ఉదాహరణే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో. 


తన బాయ్‌ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ఓ కెనడా(Canada) యువతి చేసిన ప్రయత్నం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ భారతీయుడు కావడంతో ఇండియాలోనూ ఈ వీడియో ఆసక్తి రేపుతోంది. శారా వికెట్‌ ఉండేది టొరొంటోలో. ఆమె బాయ్‌ఫ్రెండ్ భారతీయుడే. అతడు ఢిల్లీకి చెందిన వాడు. అయితే.. అతడిని ఊహించని విధంగా సర్‌ప్రైజ్ చేయాలనే తలంపుతో ఆమె ఓ సరికొత్త ప్లాన్ వేసింది. ఇందుకు కోసం ఆమె అతడి మాతృభాష పంజాబీని ఎంచుకుంది. తను పంజాబీలో మాట్లాడుతూ రికార్డు చేసిన వీడియోను నెట్టింట్లో పెట్టింది. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.   


‘‘నేను టొరొంటో(Toronto) ఉంటాను. నా బాయ్‌ఫ్రెండ్ ఢిల్లీకి(Delhi) చెందిన వాడు’’ అంటూ పంజాబీలో(Punjabi) గలగలా మాట్లాడేసింది. ‘‘నాకు వీలైనంతగా ప్రయత్నించా..’’ అంటూ ఆ వీడియోకు ఓ కాప్షన్ కూడా జత చేసింది. ఈ వీడియో నెటిజన్లకు విపరీతంగా నచ్చడంతో ఇప్పటివరకూ లక్షలకు పైగా వ్యూస్ వచ్చిపడ్డాయి.  భలే బాగా పంజాబీ మాట్లాడుతున్నావంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. గతంలోనూ విదేశీయులు భారతీయ భాషలు మాట్లాడిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఇండియన్లను సర్‌ప్రైజ్ చేశాయి. 



Updated Date - 2022-08-31T01:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising