ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడాలో కలకలం.. మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిపై..

ABN, First Publish Date - 2022-03-20T23:20:52+05:30

మసీదులో ప్రార్థిస్తున్న వారిపై ఓ యువకుడు దాడి చేశాడు. చేతిలో కొడవలి, బేర్ స్ప్రే(కారం పొడి జల్లే స్ర్పే) తీసుకుని మసీదులో ప్రవేశించి అక్కడున్న వారి అకస్మాత్తుగా కళ్లలో కారంపొడి కొట్టాడు. టోరొంటో నగరంలోని మిస్సిసాగా ప్రాంతంలో శనివారం ఈ దాడి జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: మసీదులో ప్రార్థిస్తున్న వారిపై ఓ యువకుడు దాడి చేశాడు. చేతిలో కొడవలి, బేర్ స్ప్రే(కారం పొడి జల్లే స్ర్పే) తీసుకుని మసీదులో ప్రవేశించి అక్కడున్న వారి అకస్మాత్తుగా కళ్లలో కారంపొడి కొట్టాడు. టోరొంటో నగరంలోని మిస్సిసాగా ప్రాంతంలో శనివారం ఈ దాడి జరిగింది. అయితే.. ఈ ఘటనతో మసీదులోని వారెవరికీ తీవ్ర గాయాలు కాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. నిందితుడు దాడికి తెగబడగానే..అక్కడున్న వారందరూ వేగంగా స్పందించి అతడిని అదపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చే వారు నిందితుడిని కదలకుండా నిర్బంధించారు. 


అనంతరం పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బేర్ స్ప్రే కారణంగా కొందరికి చిన్నపాటి గాయాలయ్యాయి. పోలీసులు దీన్ని ద్వేషపూరిత దాడిగా అనుమానిస్తున్నారు. కాగా.. ఈ దాడిని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్విటర్ వేదికగా ఖండించారు. ఇది చాలా ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. కెనడాలోని ప్రధాన రాజకీయ నాయకులందరూ ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించారు. కాగా.. జూన్‌లో ఒంటారియో నగరంలో ఓ వ్యక్తి ఓ పాకిస్థానీ కుటుంబాన్ని కారుతో ఢీకొట్టి నలుగురు మృతికి కారణమైయ్యాడు. ఓ మతంపై ద్వేషంతో చేసిన దాడిగా పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు.  

Updated Date - 2022-03-20T23:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising