ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడా కీలక నిర్ణయం.. విదేశీ వైద్యులకు ఓ గుడ్ న్యూస్..!

ABN, First Publish Date - 2022-10-06T00:15:06+05:30

శాశ్వతనివాసార్హత(Permanent Residency) సంబంధించిన కీలక నిబంధనలను కెనడా ప్రభుత్వం మరింత సరళీకరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: శాశ్వతనివాసార్హత(Permanent Residency) సంబంధించిన కీలక నిబంధనలను కెనడా ప్రభుత్వం మరింత సరళీకరించింది. తాజా రూల్ ప్రకారం.. తాత్కాలిక వీసాలపై కెనడాలో స్వయం ఉపాధి పొందుతున్న విదేశీ డాక్టర్లు కూడా శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.  ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పథకం(Express Entry scheme) ద్వారా విదేశీ వైద్యులకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. ఇప్పటివరకూ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పథకం కింద శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి విదేశాల్లో తమ రంగాల్లో ఏడాది పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. కెనడా సంస్థల్లో పని చేసేవారు కూడా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో.. కెనడాలో స్వయం ఉపాధి పొందుతున్న విదేశీ వైద్యులకు ఈ నిబంధనలు ప్రతిబంధకంగా మారాయి. కెనడాలో వారు సంపాదించిన వృత్తిగత అనుభవం కూడా చెల్లుబాటు అయ్యేది కాదు. ఈ అడ్డంకులను తొలగిస్తూ కెనడా ప్రభుత్వం తాజా మార్పులు చేసింది. దీంతో.. కెనడా పనిచేస్తున్న విదేశీ వైద్యులు కూడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పథకం కింద శాశ్వత నివాసార్హత కోసం అప్లై చేసుకునే అవకాశం దక్కింది. 


ఉద్యోగులు, సిబ్బంది కొరత కారణంగా కెనడాలోని అన్ని రంగాలు సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఉద్యోగఖాళీలను విదేశీయులతో భర్తీ చేయాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వం..వలస విధానాలను క్రమంగా సరళీకరిస్తోంది. కెనడా ఆరోగ్య వ్యవస్థలో కీలకంగా మారిన విదేశీ వైద్యుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇమిగ్రేషన్ మంత్రి షాన్ ప్రెజర్ తెలిపారు. ప్రస్తుతం కెనడాలో వైద్యుల కొరత నెలకొంది. హెల్త్‌కేర్ రంగంలో ఖాళీల సంఖ్య 6శాతంగా ఉంది. కరోనా సంక్షోభం కారణంగా ఈ కొరత మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇక జూన్ 2022 నాటి లెక్కల ప్రకారం.. వైద్యరంగానికి సంబంధించి 4300 మందికి కెనడాలో శాశ్వత నివాసార్హత దక్కింది. 

Updated Date - 2022-10-06T00:15:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising