ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Canada: విదేశీ ప్రయాణికులకు త్వరలో కెనడా గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 30 నాటికి..

ABN, First Publish Date - 2022-09-21T20:06:28+05:30

కెనడా(Canada) వెళ్లేందుకు ప్లాన్ చేసుకునే వారికి ముఖ్య గమనిక. కెనడా త్వరలోనే విదేశీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 30 నాటికి కెనడా ప్రభుత్వం ఈ తిపి కబురును చెప్పే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వాధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కెనడా(Canada) వెళ్లేందుకు ప్లాన్ చేసుకునే వారికి ముఖ్య గమనిక. కెనడా త్వరలోనే విదేశీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 30 నాటికి కెనడా ప్రభుత్వం ఈ తీపి కబురును చెప్పే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. కాగా.. విదేశీ ప్రయాణికుల విషయంలో కెనడా ప్రభుత్వం చెప్పే ఆ గుడ్ న్యూస్ ఏంటి? ప్రభుత్వాధికారి ఏం చెప్పారు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


కరోనా(Covid) మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం తెలిసింది. లక్షలాది మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా.. కోట్లాది మందిని వీధిన పడేసింది. కొవిడ్ విజృంభణ సమయంలో భారత్ సహా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేయడంతోపాటు కొన్ని నిబంధనలతో విదేశీ ప్రయాణికులను అనుమతించాయి. ఈ నేపథ్యంలోనే కెనడా కూడా విదేశీ ప్రయాణికుల విషయంలో కఠినంగా కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూ.. తమ దేశంలోకి అనుమతించింది. ఇప్పటికీ తమ దేశంలోకి వచ్చే విదేశీ ప్రయాణికులు.. ప్రయాణానికి ముందు కొవిడ్ టీకా(Covid Vaccine)ను తీసుకోవాలని సూచిస్తోంది. అంతేకాదు.. ఎయిర్ పోర్టులలో ప్రయాణికులకు ర్యాండమ్‌గా కొవిడ్ టెస్టులు కూడా జరుపుతోంది.



అయితే తాజాగా వీటిపై కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. తమ((Canada)) దేశంలోకి రావాలనుకునే విదేశీ ప్రయాణికులు(international passengers) ప్రయాణానికి ముందు కొవిడ్ టీకా తీసుకోవాలని అనే నిబంధనను ఎత్తివేసేందుకు సిద్ధం అయింది. అంతేకాకుండా ప్రయాణికులకు ఎయిర్ పోర్టులలో జరిపే ర్యాండమ్ కొవిడ్ టెస్టులను కూడా నిలిపి వేయాలని డిసైడ్ అయిందని కెనడాకు చెందిన ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వీటితో పాటు మరో కొన్ని కొవిడ్ నిబంధనలను కూడా ఎత్తివేసేందుకు చెప్పారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. ఆ ఆదేశాలపై ఇంకా కెనడా ప్రధాని సంతకం చేయలేదని వెల్లడించారు. ప్రధాని సంతకం అనంతరం సెప్టెంబర్ 30 నాటికి ఇందుకు సంబంధించిన ఆదేశాలు వెలువడనున్నట్టు తెలిపారు. 

Updated Date - 2022-09-21T20:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising