ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయిలో ఏదైనా సమస్య వస్తే..? దుబాయికి వెళ్లాకా కారు నడపొచ్చా..?

ABN, First Publish Date - 2022-07-19T16:35:08+05:30

ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో సందర్శకులను ఆకర్షించే ప్రదేశాల జాబితాలో దుబాయ్ నగరం కూడా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో టూరిస్టులను ఆకర్షించే సందర్శక ప్రదేశాల జాబితాలో దుబాయ్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రతియేటా దుబాయ్‌కి విదేశీయులు భారీగా వెళ్తుంటారు. ఈ క్రమంలో ఒకవేళ అక్కడికి వెళ్లిన తర్వాత ఏదైనా సమస్య వస్తే.. ఆ సమస్య పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలి. టూరిస్టులకు ఏదైనా సమస్య వస్తే దాదాపుగా వారు దిగిన హోటల్ యాజమాన్యాలు చూసుకుంటాయి. ఇక వాటి పరధిలో లేని సందర్శకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా టూరిజం పోలీస్ విభాగం ఉంటుంది. ఈ పోలీస్ డిపార్ట్‌మెంట్ కేవలం టూరిస్టులకు సంబంధించిన అభ్యర్థనలు, వారి సమస్యలను పరిష్కరిస్తుంది. అలాగే కొన్ని ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్లు కూడా అక్కడికి వెళ్లిన తర్వాత మనతో పాటు ఉండాలి. అవి.. 999-పోలీస్, 998-అంబులెన్స్, 997-అగ్నిమాపక విభాగం(సివిల్ డిఫెన్స్), 996-కోస్ట్‌గార్డ్, 991-ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్.  


దుబాయికి వెళ్లాకా కారు నడపొచ్చా..?  

సందర్శన కోసం దుబాయ్ వెళ్తే మనకు సొంతంగా కారు నడిపే అవకాశం ఉంటుందా? అంటే.. ఉంటుందనే చెప్పాలి. అయితే, మనకు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ (International Driving Licence) లేదా మన దేశంలో జారీ చేసిన చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. కారు అద్దెకు తీసుకుని నడపవచ్చు. అయితే, అక్కడి సాలిక్ టోల్‌ గేట్, పార్కింగ్ ఫీజుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు రహదారి చిహ్నాలను అర్థం చేసుకుంటే యూఏఈ (UAE) రోడ్‌ల వ్యవస్థ నావిగేట్ చేయడం చాలా సులభం. మీ ఫోన్‌లో నావిగేషన్ యాప్ లేకపోయినా మీరు చాలా సువులుగా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అన్ని ప్రధాన ఇంటర్‌సిటీ హైవేలు 'E' అక్షరంతో ప్రారంభమవుతాయి. ఉదాహరణకు 'E11', 'E311', 'E44' వంటివి. ఒకవేళ మీ వాహనం ‘E’ రోడ్డులో ఉన్నట్లయితే, మీరు హైవేపై ఉన్నారని చెప్పడానికి ఇది సూచన. ఇక దుబాయ్‌లోని అంతర్గత రహదారులు 'D' అక్షరంతో ప్రారంభమవుతాయి. అలాగే ప్రధాన రహదారుల చుట్టూ ఉన్న ఇంటర్‌ఛేంజ్‌లు కూడా నిష్క్రమణ సంఖ్యలతో గుర్తించబడతాయి. ఇది మీకు నగరం చుట్టూ నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. 

Updated Date - 2022-07-19T16:35:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising