ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత పౌరసత్వం కావాలంటూ 22 ఏళ్ల యువకుడి న్యాయపోరాటం.. తల్లి కడుపులో ఏడున్నర నెలల శిశువుగా పరాయి దేశానికి..

ABN, First Publish Date - 2022-05-20T02:46:21+05:30

భారత పౌరసత్వ చట్టం ప్రకారం కొన్ని సందర్భాల్లో కడుపులో ఉన్న పిండాన్ని కూడా మైనర్‌‌గా భావించవచ్చని మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారత పౌరసత్వ చట్టం ప్రకారం కొన్ని సందర్భాల్లో కడుపులో ఉన్న పిండాన్ని కూడా మైనర్‌‌గా భావించవచ్చని మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. తన భారత పౌరసత్వాన్ని పునరుద్ధరించాలంటూ 22 ఏళ్ల NRI ప్రణవ్ శ్రీనివాసన్ దాఖలు చేసిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 1998లో ప్రణవ్ తల్లిదండ్రులు సింగపూర్‌ పౌరసత్వం తీసుకున్నారు. అప్పటికి.. ప్రణవ్‌ తల్లి ఏడున్నర నెలల గర్భవతి. అతడు గర్భస్థ శిశువు.  ఆ తరువాత ప్రణవ్ సింగపూర్‌లోనే జన్మించడంతో.. అతడికి ఆ దేశ పౌరసత్వం లభించింది. 


ఇక భారత పౌరసత్వ చట్టం సెక్షన్ 8(1) ప్రకారం.. ఓ భారతీయ వ్యక్తి విదేశీ పౌరసత్వాన్ని తీసుకున్నప్పుడు.. అతడి మైనర్ సంతానం కూడా భారత పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అయితే.. సెక్షన్ 8(2) ప్రకారం మైనారిటీ తీరాక వారు తమ భారత పౌరసత్వాన్ని పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరే హక్కు ఉంటుంది.ఈ క్రమంలోనే 2017లో తనకు మైనారిటీ తీరాక ప్రణవ్.. తన పౌరసత్వాన్ని పునరుద్ధరించాలంటూ భారత ఎంబసీలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ.. కేంద్ర హోం శాఖ మాత్రం అతడి అభ్యర్ధనను తిరస్కరించింది. అతడి తల్లిదండ్రులు భారత పౌరసత్వం వదులుకున్న సమయంలో ప్రణవ్ గర్భస్థ శిశువు కావడంతో అతడిని మరో సెక్షన్ కింద దరఖాస్తు చేసుకోవాలని కోరింది.  దీన్ని వ్యతిరేకిస్తూ ప్రణవ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. 


అతడి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సెక్షన్ 8(2)కు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రణవ్ తల్లిదండ్రులు తమ పౌరసత్వాన్ని వదులుకున్న తేదీన ప్రణవ్ ఏడున్నర నెలల గర్భస్థ శిశువుగా ఉన్నాడని పేర్కొంది. కాబట్టి.. ఈ కేసులో అతడిని సెక్షన్ 8(1) ప్రకారం మైనర్‌గా భావించవచ్చని తీర్పు వెలువరించింది. ఇలాంటి కేసుల్లో భారత కోర్టులు గతంలో వెలువరించిన తీర్పులు, ఐక్యరాజ్య సమితి నిబంధనలను కూడా కోర్టు ఈ సందర్భంగా ఊటంకించింది. 



Updated Date - 2022-05-20T02:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising