ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లో వింత శబ్దాలు.. అంతా మీ భ్రమ అంటూ కొట్టిపారేసిన పొరుగింటోళ్లు.. ఓ రోజు రాత్రి..

ABN, First Publish Date - 2022-04-24T04:28:17+05:30

ఇంట్లో వింత శబ్దాలు వస్తున్నా పట్టించుకోని ఓ కుటుంబానికి ఇటీవల ఊహించని షాక్ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఇంట్లో వింత శబ్దాలు వస్తున్నా పట్టించుకోని ఓ కుటుంబానికి ఇటీవల ఊహించని షాక్ తగిలింది. వారి ఇంటి కింది ఉన్న చిన్న సొరంగంలో ఎలుగుబంటి తన పిల్లలతో సహా తలదాచుకుందని తెలిసి వారు షాకైపోయారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఓ ఫ్యామిలీకి ఇటీవల ఈ అనూహ్య అనుభవం ఎదరువైంది. ఎవరో వింత శబ్దాలు చేస్తున్నట్టు, గురక పెడుతున్నట్ట శబ్దాలు వస్తుండటంతో వారికి మొదటే అనుమానం వచ్చింది. ఇల్లంతా వెతికినా అనుమానాస్పదమైనవేవీ కనిపించలేదు. కానీ.. శబ్దాలు  మాత్రం వస్తూనే ఉండేవి. ఇదే విషయాన్ని పొరుగింటి వారికి చెప్పారు. 


వాళ్లేమో మాకేమీ వినిపించలేదంటూ కూల్‌గా చెప్పడమే కాకుండా.. మీరేమైనా భ్రమపడుతున్నారేమో ఆలోచించుకోండని చెప్పుకొచ్చారు. దీంతో.. ఆలోచనలో పడ్డ ఆ ఫ్యామిలి చివరికి ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేసింది. ఇటీవల ఓ రోజు రాత్రి ఆ ఎలుగుబంటి తన మూడు పిల్లలతో సహా సొరంగంలోంచి బయటకు రావడంతో చూసి ఆ కుటుంబసభ్యులందరూ షాకైపోయారు. శీతాకాలంలో ఆ ఎలుగుబంటి సొరంగంలో హైబర్‌నేట్ అయి ఉండొచ్చని వారికి తరువాత అర్థమైంది. 

Updated Date - 2022-04-24T04:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising