ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి వేళ తండ్రిపై యువకుడు దాడి.. Google సాయంతో America నుంచే రక్షించిన కుమారుడు!

ABN, First Publish Date - 2022-03-18T18:12:11+05:30

అర్ధరాత్రి వేళ ఓ యువకుడు తన తండ్రిపై దాడి చేయడాన్ని అమెరికాలో ఉంటున్న కుమారుడు గుర్తించాడు. ఆ దృశ్యాలు చూసి తట్టుకోలేకపోయాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ క్షణంలో తన తండ్రి పక్కన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అర్ధరాత్రి వేళ ఓ యువకుడు తన తండ్రిపై దాడి చేయడాన్ని అమెరికాలో ఉంటున్న కుమారుడు గుర్తించాడు. ఆ దృశ్యాలు చూసి తట్టుకోలేకపోయాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ క్షణంలో తన తండ్రి పక్కన లేనందుకు బాధపడ్డాడు. ఈ క్రమంలో తన తండ్రిని ఎలాగైనా రక్షించుకోవాలని భావించాడు. Google సహాయం తీసుకుని.. ఎట్టకేలకు తన తండ్రిని కాపాడుకున్నాడు. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఇండోర్‌కు చెందిన 63ఏళ్ల కైలాష్ చంద్ర పారిక్ గత కొన్నేళ్లుగా ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక బీజేపీ నాయకుడికి బంధువుతో ఆయనకు తాజాగా వాగ్వాదం జరిగింది. దీంతో చంద్మల్ పారిక్ అనే యువకుడు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కైలాష్ చంద్ర పారిక్‌తో గొడవకు దిగాడు. సరిగ్గా అదే సమయంలో కాలిఫోర్నియాలో ఎంఎస్ చదువుతున్న అంకిత్.. తన తండ్రి కైలాష్ చంద్ర పారిక్‌తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన తండ్రిపై దాడికి యత్నించిన చంద్మల్ పారిక్‌పై అంకిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా గూగుల్‌లో ఇండోర్ పోలీసుల ఫోన్ నెంబర్ సెర్చ్ చేసి.. అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చంద్మల్ పారిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. 




Updated Date - 2022-03-18T18:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising