ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల మార్పు.. భారతీయులకు ప్రయోజనం!

ABN, First Publish Date - 2022-09-26T13:05:04+05:30

బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కొత్తగా ఎన్నికైన ఆ దేశ ప్రధాని లిజ్‌ ట్రస్‌ మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను సడలించాలని భావిస్తున్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇమ్మి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కొత్తగా ఎన్నికైన ఆ దేశ ప్రధాని లిజ్‌ ట్రస్‌ మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను సడలించాలని భావిస్తున్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల్లో మార్పుల వల్ల ఆ దేశ వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న కార్మికుల కొరతను తీర్చుకునే అవకాశం కలుగుతుందని గార్డియన్‌ కథనం పేర్కొంది. దీనివల్ల భారత్‌ సహా చాలా దేశాల నుంచి వలస వెళ్లే వారికి ప్రయోజనం కలుగనుంది. కార్మికుల కొరత వేధిస్తున్న నేపథ్యంలో మరింత ఎక్కువ మంది కార్మికులు బ్రిటన్‌ వచ్చేలా వీసాలు ఇవ్వాలని లిజ్‌ ట్రస్‌ను పరిశ్రమలు డిమాండ్‌ చేస్తున్నాయి. వీసా ప్రక్రియ ద్వారా ఆతిథ్య రంగంలోని వ్యాపార సంస్థలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం విదేశీ కార్మికులను అనుమతించే మార్గాలను సరళీకరించవచ్చని తెలుస్తోంది. లిజ్‌ ట్రస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్మికుల కొరత సమస్యను పరిష్కరించనున్నట్టు హామీ ఇచ్చారు. 




Updated Date - 2022-09-26T13:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising