ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుర్చీ మీద నుంచి దూకిన బిల్ గేట్స్..! నెట్టింట్లో వీడియో Viral!

ABN, First Publish Date - 2022-04-06T02:34:32+05:30

కంపెనీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ తొలి రోజులను గుర్తు చేసుకుంటూ గేట్స్ ఓ పాత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ప్రతి వ్యక్తి ఇంట్లో ఓ కంప్యూటర్ ఉండాలి.. ఇదీ బిల్ గేట్స్ కన్న కల. అసలు కంప్యూటర్ అంటే ఏంటో కూడా ప్రజలకు తెలియని సమయంలో.. బిల్ గేట్స్ ఊహించిన ప్రపంచం ఇది. ఇప్పుడు ఆ కల మన కళ్లముందు వాస్తవరూపం దాల్చింది. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఆయన మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించి 47 ఏళ్లు పూర్తయ్యాయి. తన బాల్యస్నేహితుడు పాల్ ఎలెన్‌లో కలిసి 1975 ఏప్రిల్ 4న ఆయన మైక్రోసాఫ్ట్ సంస్థను నెలకొల్పారు. అయితే.. కంపెనీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ తొలి రోజులను గుర్తు చేసుకుంటూ గేట్స్ ఓ పాత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 


అందులో గేట్స్.. సరదాగా ఓ కుర్చీపై నుంచి దూకుతారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన గేట్స్.. ఓ ఆసక్తికర వ్యాఖ్య కూడా జతచేశారు. ‘‘ప్రతి ఒక్కరి ముందున్న డెస్క్‌పైనా కంప్యూటర్ ‌ఉండాలనే కల సాకారం చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఇటువంటి ఎన్నో జంప్స్ చేసింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి సాధికారత కోసం కష్టపడుతున్న మైక్రోసాఫ్ట్‌ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కొన్ని దశాబ్దాల పాటు సంస్థను ముందుండి నడిపించిన గేట్స్ 2008లో కంపెనీ రోజువారి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత మరికొన్నేళ్ల పాటు కంపెనీ బోర్డు సభ్యుడిగా ఉన్న ఆయన.. 2020లో రాజీనామా చేశారు. 



Updated Date - 2022-04-06T02:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising