ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Qatar-Bathukamma: ఖతర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు

ABN, First Publish Date - 2022-10-03T02:03:02+05:30

ప్రపంచ ఫుట్ బాల్ పోటీలకు సిద్ధం చేసిన స్టేడియంలు ఈ సారి తెలంగాణ బతుకమ్మ సంబురాలకు వేదికగా మారాయి. తెలంగాణ జాగృతి అధ్వర్యంలో ఖతర్‌లో జరిగిన బతుకమ్మ సంబరాలకు అనూహ్యమైన స్పందన లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కరోనా ఆంక్షల కారణాన గత మూడేళ్ళుగా సాంస్కృతిక, సాంఘిక జీవన స్రవంతికి దూరంగా ఉన్న గల్ఫ్‌లోని తెలంగాణ ప్రవాసీయులను ఈ సారి బతుకమ్మ ఉత్సవాలు ఎనలేని ఉత్సాహంతో ఉరకలు పెట్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా గల్ఫ్ దేశాలలో బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.


ప్రపంచ ఫుట్ బాల్ పోటీలకు సిద్ధం చేసిన స్టేడియంలు ఈ సారి తెలంగాణ బతుకమ్మ సంబురాలకు వేదికగా మారాయి. తెలంగాణ జాగృతి అధ్వర్యంలో ఖతర్‌లో జరిగిన బతుకమ్మ సంబరాలకు అనూహ్యమైన స్పందన లభించింది. ఖతర్‌లో జరగనున్న ప్రపంచ కప్ ఫుట్ బాల్ కోసం ఖతర్ ప్రభుత్వం నిర్మించిన అత్యాధునిక స్టేడియంల వద్ద బతుకమ్మలతో పాట విడుదల చేశామని తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని చెప్పారు.


భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి ఎమ్మెల్సీ కె. కవిత విడియో సందేశాన్ని వినిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖతర్ భారత రాయబారి దీపక్ మిట్టల్, ఆయన సతీమణి అల్పన మిట్టల్ హాజరు కాగా ఐసీబీఎఫ్ అధ్యక్షులు వినోద్ నాయర్, ఐసీసీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం హెబ్బగెలు, ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ కుమార్, ఐసిసి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ కోడూరి, ఐసీబీఎఫ్ ఎంసీ రజినీ మూర్తిలు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.


సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జరిగిన ఈవెంట్లలో చిన్నారులు, ఆడపడుచులు బతుకమ్మ ఆటపాటలతో అలరించగా గల్ఫ్ కార్మిక సోదరులు సైతం పల్లె పాటలతో ధూమ్ ధాంగా పాల్గొన్నారు. వివిధ రకాలుగా గల్ఫ్ కార్మికులకు అండగా నిలుస్తున్న వారిని సన్మానించారు.







Updated Date - 2022-10-03T02:03:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising