ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌లో కన్నుల పండువగా బతుకమ్మ సంబురాలు

ABN, First Publish Date - 2022-10-06T01:52:13+05:30

కువైత్‌లో కన్నుల పండువగా బతుకమ్మ సంబురాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్ .. అమీరి దివానీయా మొదలు అబ్దాలీ, వఫ్రా వ్యవసాయ క్షేత్రాల వరకు, అమెరికన్ బహుళ జాతి సంస్థలలోని ఉన్నత ఉద్యోగులు మొదలు సరిహద్దులోని ఖఫ్జీ ఎడారిలో ఒంటెల కాపరుల వరకు తెలుగు ప్రవాసీ లోకం అసంఖ్యాకం. తెలుగు ప్రవాసీయుల్లో సింహాభాగం రాయలసీమ, అందునా కడప, శ్రీ అన్నమయ్య జిల్లాలకు చెందిన వారు. అందుకే రాయలసీమలోని మారుమూల ఆటవీ గ్రామాలలోని చిన్న సంఘటన సైతం క్షణాలలో కువైత్‌కు చేరుకోంటుంది. గల్ఫ్‌లోని అన్ని దేశాలలోనూ తెలంగాణ ప్రవాసీయులది అధిపత్యం. ఒక్క కువైత్ మినహా, కువైత్‌లో తెలంగాణ ప్రవాసీయులు మైనార్టీలు!


ఈ నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు నిర్వహించడం మాములు విషయమేమి కాదు. అయినా తెలంగాణ ప్రవాసీయులు తమ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించే పూల పండుగను జరుపుకొనే వారు. కానీ గత రెండేళ్ళుగా కరోనా ఆంక్షల వలన మాత్రం జరుపుకోలేకపోయారు. కువైత్‌లోని తెలంగాణ ప్రవాసీయుల సంఘమైన కువైత్ తెలంగాణ చైతన్య సమితి (టి.సి.యస్) ఇటీవల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించింది. తెలంగాణ చైతన్య సమితి అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, కోశాధికారి గుర్రం ప్రవీణ్, సంయుక్త కార్యదర్శి సంజీవ్, పౌర సంబంధాల అధికారిగా- ఓరిగంటి రమేశ్ వ్యవహరిస్తున్నారు.



Updated Date - 2022-10-06T01:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising