ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహ్రెయిన్‌లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-10-05T03:13:07+05:30

బహ్రెయిన్... గల్ఫ్ కూటమిలో అతి చిన్న దేశం, ఒక ద్వీపకల్పం. అరబ్బులు సాధారణంగా జజీరా అని అంటారు. గల్ఫ్ లోని ప్రతి పుట్ట, చెట్టు క్రింద భారతీయులు ఉన్నట్లుగా బహ్రెయిన్‌లో కూడా భారతీయులు, అందునా తెలుగు ప్రవాసీయులు ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: బహ్రెయిన్... గల్ఫ్ కూటమిలో అతి చిన్న దేశం, ఒక ద్వీపకల్పం. అరబ్బులు సాధారణంగా జజీరా అని అంటారు. గల్ఫ్ లోని ప్రతి పుట్ట, చెట్టు క్రింద భారతీయులు ఉన్నట్లుగా బహ్రెయిన్‌లో కూడా భారతీయులు, అందునా తెలుగు ప్రవాసీయులు ఉన్నారు. భౌగోళిక, ఆర్థిక కారణాల దృష్ట్యా బహ్రెయిన్‌లో నివసించే తెలుగువారితో సహా భారతీయుల సంఖ్య ఇతర దేశాలతో పోల్చితే స్వల్పమైనా సంస్కృతి, ఆచార వ్యవహారాల విషయంలో బహ్రెయిన్‌లోని ప్రవాసీయులు ఇతరులకు ఏ మాత్రం తక్కువ కాదు, పైగా కొంచెం పై చేయిగా ఉంటారు. 


ఈసా టౌన్‌లో మధ్య తరగతి లేదా సల్మాబాద్‌లో సగటు కార్మికుడు ఎవరైన సరే, సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు లేదా ఉత్సవాలు వస్తే అందరు సమానమే. ఈ క్రమంలో దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు, తెలంగాణ సంప్రదాయక పండుగ అయిన బతుకమ్మ ఉత్సవాలను కలిపి బహ్రెయిన్‌లోని తెలుగు ప్రవాసీయులందరి కొరకు బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి శనివారం ఆదిలియాలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారతీయ ఎంబసీలోని యువ దౌత్యవేత్త ప్రియాంక త్యాగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు కళా సమితి అధ్యక్షుడు హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఫణిభూషణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వంశీ, కోశాధికారి మురళీ, సాంస్కృతిక కార్యదర్శి ఫణి హనుమంతరావు, క్రీడా కార్యదర్శి రామ శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.



Updated Date - 2022-10-05T03:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising