ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE బాటలోనే బహ్రెయిన్.. విదేశీయులకు బంపరాఫర్!

ABN, First Publish Date - 2022-02-08T18:23:53+05:30

విదేశీ నిపుణులు, పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులను ఆకర్షించేందుకు గల్ఫ్ దేశం బహ్రెయిన్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. యూఏఈ మాదిరిగానే విదేశీయులకు 'గోల్డెన్ వీసా' పేరిట దీర్ఘకాలిక వీసాలు మంజూరు చేయాలని యోచిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచే దిశగా బహ్రెయిన్ ఈ ప్రయోగానికి సిద్ధమైంది. ఇలా విదేశీయులకు దీర్ఘకాలిక వీసాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనామా: విదేశీ నిపుణులు, పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులను ఆకర్షించేందుకు గల్ఫ్ దేశం బహ్రెయిన్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. యూఏఈ మాదిరిగానే విదేశీయులకు 'గోల్డెన్ వీసా' పేరిట దీర్ఘకాలిక వీసాలు మంజూరు చేయాలని యోచిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచే దిశగా బహ్రెయిన్ ఈ ప్రయోగానికి సిద్ధమైంది. ఇలా విదేశీయులకు దీర్ఘకాలిక వీసాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక, పెట్టుబడి, సేవ రంగాలు మరింత మెరుగుపడతాయనేది బహ్రెయిన్ ఆలోచన. ఇప్పటికే ఆ దేశ మంత్రివర్గం ఈ ప్లాన్‌కు గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చేసింది. దాంతో ఈ గోల్డెన్ వీసాపై ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్గత మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొన్న దాని ప్రకారం.. విదేశీయులకు ఇచ్చే ఈ గోల్డెన్ రెసిడెన్సీ వీసా నిరవధికంగా పునరుద్ధరించబడుతుంది. 


అలాగే బహ్రెయిన్‌లో పని చేసే హక్కుతో పాటు అపరిమిత ఎంట్రీ, ఎగ్జిట్‌లకు వీలు కల్పిస్తుంది. అంతేగాక వీసాదారుడి సన్నిహిత కుటుంబ సభ్యులకు ఆ దేశంలో నివాస సౌకర్యం సైతం ఉంటుంది. "ఈ పోటీ ప్రపంచంలో బహ్రెయిన్ నెగ్గాలంటే ఇలాంటివి చాలా అవసరం. ముఖ్యంగా ఆర్థిక, పెట్టుబడి, సేవ రంగాలకు ఇది ఊతమిస్తుంది. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, బహ్రెయిన్‌ విజయానికి దోహదపడే అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను ఆకర్షించే లక్ష్యంతో ఈ వీసాను తీసుకురావడం జరుగుతుంది." అని మంత్రిత్వశాఖ వెల్లడించింది. 


గోల్డెన్ రెసిడెన్సీ వీసా పొందేందుకు అర్హులు..

* 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలంలో బహ్రెయిన్‌లో నివాసం ఉన్న ఉద్యోగులు.

* మంత్లీ శాలరీ సగటున 2వేల కువైటీ దినార్లు(రూ.3.95లక్షలు) ఉండాలి.

* దరఖాస్తుదారు తప్పనిసరిగా 2లక్షల  కేడీలకు(రూ.4,94,19,030) తగ్గకుండా ఆ దేశంలో సొంత ఆస్తులను కలిగి ఉండాలి.

* పదవివీరమణ పొందిన వారు నెలవారీగా 4వేల కువైటీ దినార్లు(రూ.9,88,380) లేదా అంతకంటే ఎక్కువ జీతం పొందుతూ ఉండాలి. 

* ఈ వీసా పొందిన వారు తప్పనిసరిగా ఏడాదికి కనీసం 90 రోజులైన బహ్రెయిన్‌లో గడపాల్సి ఉంటుంది. 


Updated Date - 2022-02-08T18:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising