ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయ వంటకాలను తొలిసారిగా టేస్ట్ చేసిన ఆస్ట్రేలియా చిన్నారి.. ఎలా రియాక్ట్ అయిందో మీరే చూడండి!

ABN, First Publish Date - 2022-04-27T20:16:22+05:30

భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. ఇండియన్ ఫుడ్ అని చెబితే చాలు లొట్టలేసుకుని తినే విదేశీయులు చాలా మందే ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో ఓ ఆస్ట్రేలియా చిన్నారి కూడా చేరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. ఇండియన్ ఫుడ్ అని చెబితే చాలు లొట్టలేసుకుని తినే విదేశీయులు చాలా మందే ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో ఓ ఆస్ట్రేలియా చిన్నారి కూడా చేరిపోయింది. ఇండియన్ స్టైల్‌లో మసాలాలు దట్టించి క్రమ పద్ధతిలో ప్రత్యేకంగా వండిన వంటకాన్ని తొలిసారిగా రుచి చూసిన చిన్నారి వాటికి ఫిదా అయిపోయింది. ఈ క్రమంలో ఆ చిట్టితల్లి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఆస్ట్రేలియాకు చెందిన ఓ 10ఏళ్లలోపు చిన్నారి కొద్ది రోజుల క్రితం స్థానికంగా ఉన్న ఇండియన్ రెస్టారెంట్‌ను సందర్శించింది. అక్కడ రైస్‌తోపాటు కాధీ చికెన్‌ కర్రీని ఆర్డర్ ఇచ్చింది. అనంతరం వాటిని టేస్ట్ చేసి లొట్టలేకుంటూ తినేసింది. వెంటనే మ్యాంగో కుల్ఫీని కూడా తెప్పించుకుని.. దాని రుచిని ఎంజాయ్ చేసింది. చివరగా రెస్టారెంట్‌లో ఉన్న సోపు తీసుకుని నోట్లో వేసుకుంది. అంతే.. దాని ఫ్లేవర్, టేస్ట్‌కు ముగ్దురాలైపోయి.. ముద్దుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఆ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంత‌ో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-04-27T20:16:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising