ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రేలియాలో మరో కరోనా వేవ్ ముప్పు.. రికార్డు స్థాయిలో ప్రజలు ఆస్పత్రుల్లో చేరిక..

ABN, First Publish Date - 2022-06-29T03:20:17+05:30

ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రా మరో కరోనా వేవ్‌ ముప్పును ఎదుర్కొంటోందని స్థానిక ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రా మరో కరోనా వేవ్‌ ముప్పును ఎదుర్కొంటోందని స్థానిక ఆరోగ్య శాఖ హెచ్చరించింది. కేసుల సంఖ్యను బట్టి ఇప్పటికే కరోనా వేవ్ మొదలై  ఉంటుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ కాపిటల్ టెరిటరీ ఆరోగ్య శాఖ మంత్రి రేచల్ స్టీఫెన్ స్మిత్ మంగళవారం నాటి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుతం కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది కరోనా వేవ్ ప్రారంభం కావచ్చు. ’’ అని తెలిపారు. కాబట్టి.. పరిస్థితి నిశితంగా గమనిస్తున్నామన్నారు. ఇటీవల కాలంటో క్యాపిటల్ ప్రాంతంలో కేసుల  సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 



తాజా లెక్కల ప్రకారం.. మంగళవారం నాటికి అక్కడి వివిధ ఆస్పత్రుల్లో 121 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. కరోనా సంక్షోభం తొలి రోజుల తరువాత.. ఈ స్థాయిలో కేసులు వెలుగులోకి రావడం ఇదే ప్రథమం. ఓ ఆస్పత్రిలోని క్యాన్సర్ వార్డులో కొందరు పేషెంట్ల కరోనా బారిన పడటంతో మళ్లీ కేసుల పెరుగుదలకు బీజం వేసిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. స్థానిక జనాభాలో వైరస్ ఏ మేరకు వ్యాప్తించెందిందో తెలుసుకునేందుకు మరి కొంత సమయం పడుతుందంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకూ ఎనిమిది లక్షల పైచిలుకు కరోనా కేసులు వెలుగు చూశాయి. 9704 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 226,653. దేశవ్యాప్తంగా 3133 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మంగళవారం కొత్తగా 30 వేల కేసులు వెలుగు చూడగా.. 70 మంది కరోనాకు బలయ్యారు. 

Updated Date - 2022-06-29T03:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising