ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌లో తల్లిదండ్రులు.. బాలుడికి నరకం చూపిన మేనత్త దంపతులు.. సొంత బిడ్డలా చూసుకుంటామని చెప్పి చివరికి..

ABN, First Publish Date - 2022-09-05T16:04:10+05:30

అల్లరి చేస్తున్నాడని ఎనిమిదేళ్ల బాలుడిని మేనత్త, ఆమె భర్త చిత్రహింసలకు గురిచేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కడప నగరం ఓంశాంతినగర్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ దారుణం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు అన్నమయ్య జిల్లా నందలూరు కోనాపురం హరిజనవాడకు చెందిన వెలగచెర్ల శివకుమార్‌, భాగ్యలక్ష్మి దంపతు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అల్లరి చేస్తున్నాడని ఎనిమిదేళ్ల బాలుడిని మేనత్త, ఆమె భర్త చిత్రహింసలకు గురిచేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కడప నగరం ఓంశాంతినగర్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ దారుణం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు అన్నమయ్య జిల్లా నందలూరు కోనాపురం హరిజనవాడకు చెందిన వెలగచెర్ల శివకుమార్‌, భాగ్యలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం కువైత్‌ వెళ్లారు. వీరు ఏడాది, రెండేళ్లకు ఓసారి స్వదేశానికి వచ్చి వెళుతుంటారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వీరంతా శివకుమార్‌ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. శివకుమార్‌ చెల్లెలు ఇంద్రజ 10 రోజుల క్రితం భర్త అంజన్‌కుమార్‌తో కలిసి పుట్టింటికి వచ్చారు. శివకుమార్‌ పెద్దకుమారుడు అశ్రిత్‌కుమార్‌(8)ను తమ దగ్గర ఉంచుకుని బాగా చదివిస్తామని ఇంద్రజ దంపతులు తమ ఇంటికి తెచ్చుకున్నారు. ఇదే విషయాన్ని అన్న శివకుమార్‌కూ ఇంద్రజ ఫోన్‌లో తెలిపారు. తమ బిడ్డలాగా చూసుకుంటామంటూ ఒప్పించారు. 



ఇంద్రజ దంపతులు కడప నగరం వై.జంక్షన్‌ సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కాగా, బాగా అల్లరి చేస్తున్నాడని అశ్రిత్‌కుమార్‌ను ఇంద్రజ, అంజన్‌కుమార్‌ చిత్రహింసలకు గురిచేశారు. శనివారం రాత్రి బాలుడిని తీవ్రంగా కొట్టడంతో రాత్రి 11.45 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే రిమ్స్‌కు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బాలుడు చనిపోయాడని చెప్పారు. దీంతో ‘అన్నయ్యా! మమ్మల్ని క్షమించు. మేం చేయరాని తప్పు చేశాం. మేనల్లుడు అశ్రిత్‌కుమార్‌ చనిపోయాడు’ అంటూ కువైత్‌లో ఉన్న శివకుమార్‌కు ఇంద్రజ వాయిస్‌ మెసేజ్‌ పెట్టి, ఫోన్‌ స్విచ్‌ఆ్‌ఫ చేసేశారు. భర్త, కుమార్తెతో కలిసి పరారయ్యారు. శివకుమార్‌ ఇచ్చిన సమాచారంతో ఆయన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు రిమ్స్‌కు చేరుకుని బాలుడి మృతదేహాన్ని చూసి విలపించారు. బాలుడి ముఖంపైనా, తొడపైనా గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.


Updated Date - 2022-09-05T16:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising