ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ప్రారంభమైన ATA వేడుకలు

ABN, First Publish Date - 2022-07-03T01:23:35+05:30

అమెరికన్ తెలుగు అసోసియేషన్ 17వ మహాసభలు శుక్రవారం రాత్రి అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో వైభవంగా ప్రారంభమయ్యాయి.

కూచిభొట్ల ఆనంద్‌కు అవార్డును ప్రదానం చేస్తున్న ఆటా అధ్యక్షుడు భువనేశ్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖులకు అవార్డుల ప్రదానం

వాషింగ్టన్ నుండి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కిలారు ముద్దు కృష్ణ: అమెరికన్ తెలుగు అసోసియేషన్ 17వ మహాసభలు శుక్రవారం రాత్రి అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్యాంక్వెట్ విందు కార్యక్రమంతో ఉత్సవాలను ప్రారంభించారు. అమెరికాలో భారత రాయబారి నందు ప్రారంభోపన్యాసం చేశారు. వివిధ రంగాలలో ప్రముఖులకు అవార్డులను అందజేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లికార్జున రావు, అమెరికాలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఐకా రవి, సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్, అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్ చలసాని నాగ ప్రసాద్, ప్రముఖ కూచిపూడి కళాకారిణి లక్ష్మీ బాబు తదితరులకు అవార్డులను అందజేశారు.


ఆటా అధ్యక్షుడు భువనేశ్ భుజాల మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్, రకుల్ ప్రీతిసింగ్ తమ ప్రసంగాలతో  అలరించారు. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు, కవులు, కళాకారులు, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే .శ్రీనివాస్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.















Updated Date - 2022-07-03T01:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising