ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE Jobs: వచ్చే ఏడాది కనీసం 10వేల మంది భారతీయు కార్మికులకు ఉద్యోగాలు.. భారత కాన్సులేట్ ప్రకటన

ABN, First Publish Date - 2022-08-02T13:39:24+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని భారత కాన్సులేట్ (Indian Consulate) వచ్చే ఏడాది ఆ దేశంలో కనీసం 10వేల మంది మంచి నైపుణ్యం కలిగిన కార్మికులకు (High Skilled Workers) ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని భారత కాన్సులేట్ (Indian Consulate) వచ్చే ఏడాది ఆ దేశంలో కనీసం 10వేల మంది మంచి నైపుణ్యం కలిగిన ఇండియన్ కార్మికులకు (High Skilled Workers) ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని వెల్లడించింది. ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్స్ (Tejas) ప్రాజెక్ట్ ద్వారా ఇలా భారీ సంఖ్యలో భారత ప్రవాసులకు ఉపాధి కల్పించనున్నట్లు ఈ సందర్భంగా కాన్సులేట్ పేర్కొంది. ఇటీవలి కాలంలో ప్రవాసులు ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్లి అక్కడ మోసపూరిత నియామకాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ (NSDC)తో కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమానికి కాన్సులేట్ శ్రీకారం చుట్టింది. NSDC కు చెందిన సిబ్బంది యూఏఈలో వివిధ రంగాలలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలను తెలుసుకుని వాటికి తగ్గటుగా ప్రవాసులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. హెల్త్‌కేర్, రిటైల్ తదితర రంగాలలో ఇలా ప్రవాసులకు శిక్షణ ఇచ్చి అనంతరం వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఈ ఏడాది మార్చిలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని దుబాయ్ ఎక్స్‌పో 2020 (Expo 2020) ప్రారంభించడం జరిగింది. ఇక ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్స్ (Tejas) శిక్షణ కార్యక్రమం అనేది ఇటు భారత్‌తో పాటు అటు దుబాయ్‌లో కూడా నిర్వహించడం జరుగుతుంది.  

Updated Date - 2022-08-02T13:39:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising