ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తల ఎఫెక్ట్.. ఇండియాకు తిరిగొస్తున్న భారతీయులు

ABN, First Publish Date - 2022-02-23T20:30:04+05:30

ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే రష్యా సైన్యం ఉక్రెయిన్‌ను చుట్టుముట్టింది. ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడి చేసేందుకు అవకాశం ఉందనే వార్తలొస్తున్నాయి. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే రష్యా సైన్యం ఉక్రెయిన్‌ను చుట్టుముట్టింది. ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడి చేసేందుకు అవకాశం ఉందనే వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో సుమారు 250 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారు. భారతీయ నిపుణులు, విద్యార్థులతో బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం రాత్రి 10.15 గంటలకు ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి మురళీధరన్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు మరిన్ని విమానాలను నడపనున్నట్టు పేర్కొన్నారు. 



ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలికంగా ఉక్రెయిన్‌ను వీడాలని భారతీయులకు ఇప్పటికే సూచించిన ఇండియన్ ఎంబసీ మంగళవారం కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. కాగా.. ఉక్రెయిన్‌లో సుమారు 20వేల మంది వరకు భారతీయ విద్యార్థులు, నిపుణులు ఉన్నట్టు సమాచాం. 



Updated Date - 2022-02-23T20:30:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising