ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Muscat: మస్కట్‌లో తెలుగు మహిళ అరణ్య రోదన.. తిరిగి స్వదేశానికి వెళ్లాలంటే రూ.20లక్షలు ఇవ్వాలంటూ..

ABN, First Publish Date - 2022-09-16T19:03:42+05:30

ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన తెలుగు మహిళను తిరిగి స్వదేశానికి పంపించేందుకు అక్కడి ఏజెంట్ల వేధింపులకు పాల్పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: ఉపాధి కోసం మస్కట్ (Muscat) వెళ్లిన తెలుగు మహిళను తిరిగి స్వదేశానికి పంపించేందుకు అక్కడి ఏజెంట్ల వేధింపులకు పాల్పడుతున్నారు. రూ.20లక్షలు చెల్లిస్తేనే తిరిగి ఇండియాకు పంపిస్తామని బెదిరిస్తూ.. తీవ్రంగా శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని బాధితురాలు తాజాగా తన భర్తకు ఓ వీడియో ద్వారా తెలియజేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తిరుపతి జిల్లా ఎర్రవారి పాలెం మండలం బోడెవడ్లపల్లి పంచాయతీలోని చెట్టి హరిజనవాడకు చెందిన కే. సులోచన  తన కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. దాంతో ఎర్రవారి పాలెంకు చెందిన ఏజెంట్ రత్నమ్మను కలిసి తన పరిస్థితులను వివరించి తనను విదేశాలకు పంపించాలని కోరింది. 


దాంతో రత్నమ్మ ఆమె వద్ద కొంత మొత్తం తీసుకుని మస్కట్ పంపించే ఏర్పాటు చేసింది. మస్కట్ వెళ్లాక అక్కడి ఏజెంట్లు సులోచన దగ్గర మరికొంత తీసుకున్నారు. అనంతరం ఓ ఫ్యామిలీ వద్ద పనిమనిషిగా కుదిర్చారు. ఈ క్రమంలో ఆమెకు  ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో తిరిగి స్వదేశానికి రావాలనుకుంది. కానీ, ఏజెంట్లు సులోచనను భారత్‌కు పంపించాలంటే తమకు రూ. 20 లక్షలు చెల్లించాలని బెదిరించడం మొదలెట్టారు. తన వద్ద అంతా భారీ మొత్తం లేదని, తాను ఉపాధి కోసం ఇక్కడికి వచ్చానని బతిమాలిన వారు కనికరించలేదు. 


శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఆమె కాలికి గాయం కావడంతో ఆస్పత్రికి వచ్చిన సులోచన తన పరిస్థితిని భర్తకు వీడియో కాల్ ద్వారా తెలియజేసింది. అక్కడ ఏజెంట్లు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, స్వదేశానికి పంపించాలంటే రూ.20లక్షలు ఇవ్వాలని చెబుతున్నారని భర్తకు వివరించింది. అలాగే ఏజెంట్ రత్నమ్మను కూడా ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తే.. ఆమె రూ.2లక్షలు ఇస్తే స్వదేశానికి రప్పిస్తానని చెప్పినట్లు తెలిపింది. దాంతో సులోచన భర్త ఈ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Updated Date - 2022-09-16T19:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising