ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షేమంగా స్వదేశానికి.. ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న మరో 11 మంది తెలుగు విద్యార్థులు

ABN, First Publish Date - 2022-03-01T13:24:15+05:30

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల్లో సోమవారం మరో 11 మంది క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల్లో సోమవారం మరో 11 మంది క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. నాలుగో విడతగా ఐదుగురు, ఐదో విడతగా ఆరుగురు చొప్పున ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. వారిలో పదిమంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కాగా.. ఒకరు హైదరాబాద్‌ విద్యార్థి. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఇక్కడ ఏపీ భవన్‌కు చేరుకున్న విద్యార్థులకు ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ పర్యవేక్షణలో వసతి, భోజన, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు. నాలుగో విడత వచ్చిన ఐదుగురిలో సుదేశ్‌ మోహన్‌ నట్ల (ఒంగోలు), ప్రియాంక జాగర్లమూడి(తిరుపతి), శ్రీచైతన్య తేజ అంబాలకర (తిరుపతి), ఐదో విడతగా వచ్చిన విద్యార్థుల్లో కొల్లి గోపీకృష్ణ(గుంటూరు), బాబా సొహైల్‌(అనంతపురం), బొంగి యోగి(విశాఖపట్నం), విష్ణువర్థన్‌ గోపాలం(గుంటూరు), హర్షవర్థన్‌(కడప), ఆవుల యశశ్రీ రుషిత సరోజ (విజయవాడ) ఉన్నారు.

Updated Date - 2022-03-01T13:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising