ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 నెలల గర్భవతిగా ఉన్న నా భార్యను విడిచి ఇండియాకు రాలేను.. ఉక్రెయిన్‌లో NRI ఆవేదన

ABN, First Publish Date - 2022-03-07T20:55:45+05:30

ఉక్రెయిన్-రష్యా మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతోంది. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్-రష్యా మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతోంది. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ భారతీయుడు మాత్రం ఇండియాకు రాలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గర్భవతిగా ఉన్న తన భార్యను ఒంటరిగా వదిలి స్వదేశానికి రాలేనని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



ఇండియాకు చెందిన గగన్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఉక్రెయిన్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె 8నెలల గర్భవతి. భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆపరేషన్ గంగా’ ద్వారా కేవలం భారత పౌరులు మాత్రమే ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. దీంతో గగన్ తన భార్యను తనతోపాటు ఇండియాకు తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తన భార్యను ఒంటరిగా వదిలి ఇండియాకు రాలేనని గగన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను భారత పౌరుడిని. ‘ఆపరేషన్ గంగా’ ద్వారా ఇండియాకు వెళ్లొచ్చు. కానీ నా భార్య ఉక్రెయిన్ పౌరురాలు. అందువల్ల ఆమెను భారత్‌కు తీసుకురాలేను. ప్రస్తుతం ఆమె 8నెలల గర్భవతి. ఆమెను ఒంటరిగా వదిలిపెట్టలేను. ఇపుడు ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాం. నా ఫ్యామిలితో కలిసి పోలాండ్‌కు వెళ్లాలనుకుంటున్నా’ అని మీడియాకు తెలిపాడు. 


ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం ఫిబ్రవరి 26న ‘ఆపరేషన్ గంగా’ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు సుమారు 16వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించింది. మార్చి 7న ఎనిమిది విమానాల ద్వారా మరో 1500 మందిని ఇండియాకు తరలించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. 




Updated Date - 2022-03-07T20:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising