ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాషింగ్టన్‌కు బయల్దేరిన విమానం.. మార్గమధ్యంలోనే అత్యవసర ల్యాండింగ్.. కారణం ఏంటంటే!

ABN, First Publish Date - 2022-02-14T17:28:17+05:30

వాషింగ్టన్‌కు బయల్దేరిన విమానాన్ని మార్గమధ్యంలోనే పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఆ తర్వాత కొద్ది సమయానికి విమానం తిరిగి గమ్యస్థానానికి చేరుకుంది. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి గల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: వాషింగ్టన్‌కు బయల్దేరిన విమానాన్ని మార్గమధ్యంలోనే పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఆ తర్వాత కొద్ది సమయానికి విమానం తిరిగి గమ్యస్థానానికి చేరుకుంది. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి గల కారణం ఏంటనే వివరాల్లోకి వెళితే..



అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1775 నెంబర్‌ గల విమానం లాస్ ఏంజిల్స్ విమానాశ్రయం నుంచి వాషింగ్టన్‌కు ఆదివారం బయల్దేరింది. ప్లైట్ గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు విమానంలో హల్‌చల్ చేశాడు. తన ప్రవర్తనతో సిబ్బందికి, ప్రయాణికులకు భయాందోళనలకు గురి చేశాడు. దీంతో విమానాన్ని పైలట్‌ కాన్సాస్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు డైవర్ట్ చేసి, విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. ఈ క్రమంలో సదరు ప్యాసింజర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కాన్సాస్ నుంచి బయల్దేరిన విమానం సురక్షితంగా వాషింగ్టన్‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువైపోయాయని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఇవి మళ్లీ పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. 




Updated Date - 2022-02-14T17:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising