ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America లో ఒమైక్రాన్‌ స్వైర విహారం.. ఒక్కరోజే 11 లక్షల కేసులు

ABN, First Publish Date - 2022-01-12T13:18:18+05:30

అమెరికాలో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసులు ప్రపంచ రికార్డులను బద్ధలు కొడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమవారం 11 లక్షల పైచిలుకు కేసుల నమోదు

వాషింగ్టన్‌: అమెరికాలో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసులు ప్రపంచ రికార్డులను బద్ధలు కొడుతున్నాయి. సోమవారం ఒక్కరోజే యూఎస్‌లో 11 లక్షల 30 వేల మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. వారాంతంలో యూఎస్‌లోని చాలా రాష్ట్రాలు కొత్త కేసుల సంఖ్యను ప్రకటించలేదు. దీంతో సోమవారం పాజిటివ్‌ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. సోమవారం నాటికి మరికొన్ని రాష్ట్రాలు ఇంకా నివేదిక ఇవ్వాల్సి ఉండటంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, గతంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో పాజిటివ్‌లు సోమవారం ఆస్పత్రుల్లో చేరారు. గత ఏడాది జనవరిలో 1,32,051 మంది ఆస్పత్రిలో చేరగా, తాజాగా 1,35,500 మంది చేరారు.


ఒమైక్రాన్‌ వేగంగా విస్తరిస్తుండటంతో 3 వారాలుగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య రెట్టింవుతోంది. డెలావర్‌, ఇల్లినాయి, మేరీల్యాం డ్‌, మిస్సోరి, ఓహియో, పెన్సిల్వేనియా, వర్జీనియా ఐల్యాండ్స్‌, వర్జీనియా, వాషింగ్టన్‌ డీసీ తదితర నగరాల్లో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య రికార్డు స్థాయికి చేరిందని వార్తా సంస్థ రాయ్‌టర్స్‌ విశ్లేషించింది. ఒమైక్రాన్‌ వ్యాప్తి ఇలాగే కొనసాగితే వచ్చే రెండు నెలల్లోనే యూర్‌పలో సగానికి పైగా జనాభా కొవిడ్‌ బారిన పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జనవరి మొదటి వారంలో ఇక్కడ 70 లక్షలకుపైగా పాజిటివ్‌లు నమోదయ్యాయి. కాగా, చైనాలో కేసులు పెరుగుతుండటంతో అ న్యాంగ్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పటి వరకు షియన్‌, యుజౌ నగరాల్లో లాక్‌డౌన్‌ పె ట్టారు. ఈ 3 నగరాల్లో లాక్‌డౌన్‌తో మొత్తం 2 కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు.

Updated Date - 2022-01-12T13:18:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising