ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయ కాల్ సెంటర్లపై కేసులు నమోదు చేసిన అమెరికా అధికారులు

ABN, First Publish Date - 2022-02-10T01:26:11+05:30

ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న భారతీయ కాల్ సెంటర్లపై అమెరికా అధికారులు కొరడా ఝుళిపించారు. అమెరికన్ పౌరులను తప్పుదోవ పట్టించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న కారణంగా ఆరు కాల్ సెంటర్లపై అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న భారతీయ కాల్ సెంటర్లపై అమెరికా అధికారులు కొరడా ఝుళిపించారు. అమెరికన్ పౌరులను తప్పుదోవ పట్టించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న కారణంగా ఆరు కాల్ సెంటర్లపై అధికారులు కేసులు నమోదు చేశారు. కాల్ సెంటర్ల ప్రతినిధులు స్కామ్ కాల్ చేస్తూ ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పి.. అమెరికా పౌరులను భయపెట్టి వారి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించేవారని వెల్లడించారు. అనంతరం బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు దోచుకునే వారని పేర్కొన్నారు. కాగా.. బాధితుల సంఖ్య ఎక్కువైపోవడంతో కాల్ సెంటర్లపై దృష్టిపెట్టిన అధికారులు.. ఆరు కాల్ సెంటర్లు వాటి డైరెక్టర్లపై కేసులు నమోదు చేశారు. అధికారులు కేసులు నమోదు చేసిన కాల్ సెంటర్ల జాబితాలో టెక్నోమైండ్ ఇన్ఫో సొల్యూషన్స్, ఎస్ఎమ్ టెలికమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శివాయ్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మరో మూడు కాల్ సెంటర్లు ఉన్నాయి.  ఇదిలా ఉంటే.. గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడిన ఓ డైరెక్టర్‌కు అమెరికా న్యాయస్థానాలు 20ఏళ్ల జైలు శిక్ష విధించాయి. 




Updated Date - 2022-02-10T01:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising