ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రీగా ఇంటికి పంపిస్తాం అనడంతో.. ఆన్‌లైన్‌లో కుర్చీ ఆర్డరిస్తే..

ABN, First Publish Date - 2022-02-02T05:22:05+05:30

ఆన్‌లైన్‌లో కుర్చీకి ఆర్డరిచ్చిన అమెరికా మహిళకు ఊహించని షాక్ తగిలింది. మనిషి పట్టేంత కుర్చీ ఇంటికి వస్తుందనుకుంటే.. చేతిలో ఇమిడిపోయే బొమ్మ కుర్చీ రావడంతో ఆమె ఒక్కసారిగా షాకైపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్:  ఆన్‌లైన్‌లో కుర్చీకి ఆర్డరిచ్చిన అమెరికా మహిళకు ఊహించని షాక్ తగిలింది. మనిషి పట్టేంత కుర్చీ ఇంటికి వస్తుందనుకుంటే.. చేతిలో ఇమిడిపోయే బొమ్మ కుర్చీ రావడంతో ఆమె ఒక్కసారిగా షాకైపోయింది. తన అనుభవం గురించి వివరిస్తూ టిక్‌టాక్‌లో ఓ వీడియో పెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతూ నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. ఇలాంటి అనూహ్య పరిస్థితి ఎదుర్కొన్న మహిళ పేరు మరియమ్. ఆమె ఉండేది న్యూయార్క్‌లో..!


మరియమ్ కథనం ప్రకారం.. ఆమె ఇటీవల ఓ రోజు నెట్‌లో బ్రౌజ్ చేస్తుండగా ఆ కుర్చీ కంటపడింది. చూడటానికి చాలా అందంగా, బంగారం రంగు బోర్డర్‌తో వెల్వెట్ రంగు వస్తంతో ఉన్న కుర్చీని చూడగానే ఆమె మనసు పారేసుకుంది. ఫ్రీగా ఇంటికి పంపిస్తాం అనే ఆఫర్ కూడా ఉండటంతో.. మరియమ్ వెంటనే ఆర్డ్‌ర్ పెట్టేసింది. కానీ..చివరకు మాత్రం ఆమెకు ఇలా ఊహించని అనుభవం ఎదురైంది. అయితే.. నెటిజన్లలో అధికశాతం మంది ఆమె పరిస్థితికి బాధపడినప్పటికీ..కొందరు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వస్తువు కొనేముందు వాటి రివ్యూలు చూస్తే..కుర్చీ గురించి మరిన్ని వివరాలు తెలిసి ఉండేవి కదా అంటూ కొందరు కామెంట్ చేశారు. 

Updated Date - 2022-02-02T05:22:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising