ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యంలో దొంగల హల్‌చల్.. మహిళను కారుతో ఢీకొట్టి..

ABN, First Publish Date - 2022-04-18T20:36:36+05:30

అగ్రరాజ్యం అమెరికాలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. మహిళను కారుతో ఢీకొట్టి మరీ అమె వద్ద ఉన్న విలువైన వస్తువులను చోరీ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. మహిళను కారుతో ఢీకొట్టి మరీ అమె వద్ద ఉన్న విలువైన వస్తువులను చోరీ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఓ మహిళ స్థానికంగా ఉన్న జ్యువలరీ షాపును తాజాగా సందర్శించింది. అక్కడ తనకు నచ్చిన కొన్ని ఆభరణాలను కొనుగోలు చేసి తిరిగి ఇంటికి పయనమైంది. ఈ క్రమంలో ఇద్దరు దుండగులు ఆమెపై కన్నేశారు. షాప్‌ నుంచి బయటి వచ్చిన వెంటనే ఆమెను వెంబడించారు. అది గమనించిన ఆమె.. వారి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తడం ప్రారంభించింది. దీంతో కారులో ఆమెను ఫాలో అయిన దుండగులు.. సదరు మహిళను వాహనంతో ఢీ కొట్టారు. అనంతరం ఆమె దగ్గర ఉన్న కొన్ని విలువైన వస్తువులను దొంగిలించి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన వారం క్రితం జరగ్గా.. అందుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు తాజాగా విడుదల చేశారు. అంతేకాకుండా ఆ దుండగులను పట్టుకునేందుకు స్థానికుల సహాయాన్ని కోరుతున్నారు. 




Updated Date - 2022-04-18T20:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising