ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Two sets of twins: ఇలాంటి కవలలను మీరెక్కడా చూసుండరు..! కొటి మందిలో ఒక్కరికి మాత్రమే ఇలా..

ABN, First Publish Date - 2022-08-01T02:57:16+05:30

అమెరికాలో ఓ మహిళ అరుదైన జంట కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడశిశువులు.. ఇద్దరు మగశిశువులు ఉన్న జంట కవలలను ప్రసవించింది. ప్రతి కోటి మందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో ఓ మహిళ అరుదైన జంట కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడశిశువులు.. ఇద్దరు మగశిశువులు ఉన్న జంట కవలలను ప్రసవించింది. ప్రతి కోటి మందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. బోస్టన్‌లో ఉండే 35 ఏళ్ల ఆష్లే నెస్‌ను ఈ అరుదైన అదృష్టం వరించింది. ఆష్లేకు అంతకుమునుపే ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. నాలుగు సార్లు గర్భస్రావం జరిగాక ఆమె ఇలా నలుగురు బిడ్డలను కన్నది.


వైద్యులు చెప్పుతున్న దాని ప్రకారం.. ఇలాంటి సంతానం కలగాలంటే రెండు అండం రెండు వేరువేరు శుక్రకణాలతో ఫలదీకరణం చెందాలి. ఆ తరువాత.. ఆ అండాలు రెండుగా విభజితమైతే ఇలా జంట కవలలు పుడతారని వైద్యులు చెబుతున్నారు. గతంలో కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ వేరు వేరు రోజుల్లో కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతం వైరల్ అయింది. ప్రతి ఇరవైలక్షల కేసుల్లో ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-08-01T02:57:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising