ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: విద్యార్థుల గొడవ.. పోలీసుల కొంప ముంచింది!

ABN, First Publish Date - 2022-09-28T23:24:10+05:30

విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న గొడవ.. పోలీసుల కొంప ముంచింది. పోలీసులపై ఉన్నాధికారులు విచారణ జరిపించేందుకు రెడీ అయ్యే విధంగా చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. విద్యార్థులు గొ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న గొడవ.. పోలీసుల కొంప ముంచింది. పోలీసులపై ఉన్నాధికారులు విచారణ జరిపించేందుకు రెడీ అయ్యే విధంగా చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. విద్యార్థులు గొడవ పెట్టుకుంటే.. పోలీసు అధికారులపై విచారణ జరిపడం ఎందుకు? అని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. 


టెక్సాస్‌(Texas)లోని ఇర్వింగ్ ప్రాంతంలో ఉన్న నిమిట్జ్ హై స్కూల్‌లో కొందరు విద్యార్థులు గొడవకు దిగారు. క్యాంటీన్‌లో ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కొట్టుకుంటున్న విద్యార్థులను దూరంగా నెట్టేశారు. ఈ నేపథ్యంలోనే ఓ పోలీసు అధికారి(US Police Officer) తిడుతూ ఓ విద్యార్థిని క్యాంటీన్‌లోని తోపుడు బండిపైకి తోసేశాడు. దీంతో విద్యార్థి నేలపై పడిపోయాడు. అనంతరం సదరు విద్యార్థి పైకి లేచాడు. ఈ క్రమంలోనే ఆ పోలీసు అధికారి తిరిగి ఆ విద్యార్థిని వెనెక్కి నెట్టేశాడు. గొడవకు దిగిన ఇతర విద్యార్థులను కూడా అక్కడున్న పోలీసులు అదుపు చేశారు. 


ఈ ఘటన గత బుధవారం చోటు చేసుకోగా.. అందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు సోషల్ మీడియా(Social Meida)లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్‌(Viral)గా మారింది. గొడవను ఆపే ప్రయత్నంలో విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని కొందరు తప్పబట్టారు. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు పోలీసులపై విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉంటే.. విద్యార్థుల మధ్య గొడవ ఎందుకు జరిగింది? గొడవను అదుపు చేసే క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య ఏదైనా వాగ్వాదం చోటు చేసుకుందా? వంటి విషయాలపై స్పష్టత లేదు. 




Updated Date - 2022-09-28T23:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising