ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

USA: అమెరికాలో షాకింగ్ ఘటన..!

ABN, First Publish Date - 2022-09-23T02:00:54+05:30

అమెరికాలో(USA) మంగళవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనకు థాంక్యూ(Thank you) ఎందుకు చెప్పట్లేదంటూ వాగ్వాదానికి దిగిన ఓ వ్యక్తి అనూహ్య రీతిలో దారుణ హత్యకు గురయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో(USA) మంగళవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనకు థాంక్యూ(Thank you) ఎందుకు చెప్పట్లేదంటూ వాగ్వాదానికి దిగిన ఓ వ్యక్తి అనూహ్య రీతిలో దారుణ హత్యకు గురయ్యాడు. న్యూయార్క్ నగరంలోని (Newyork) బ్రూక్లిన్ (Brooklyn) ప్రాంతంలోని పొగాకు సంబంధిత వస్తువులు అమ్మే ఓ షాపు (Smoke Shop) వద్ద రాత్రి 10.20కి ఈ ఘటన జరిగింది. దీని తాలూకు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ షాపులోని ఉద్యోగి కళ్లముందే ఈ దారుణం జరిగింది. అతడి కథనం ప్రకారం.. తెల్ల టీషర్టు ధరించిన ఓ వ్యక్తికి.. బ్యాగు ధరించిన మరో వ్యక్తి షాపు వద్ద ఎదురుపడ్డాడు. ఆ సమయంలో తెల్ల టీషర్టు ధరించిన వ్యక్తి నిందితుడి కోసం షాపు తలుపు తెరిచాడు. కానీ.. నిందితుడు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు.


దీంతో.. తెల్ల టీషర్టు వేసుకున్న వ్యక్తి అతడిని అడ్డుకుని..నాకు థాంక్యూ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించాడు. ‘‘నేనేమీ నిన్ను డోర్ తెరవమని అడగలేదుగా’’ అని అవతలి వ్యక్తి సమాధానమిచ్చాడు. దీంతో.. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. తర్వాత..వారు షాపు బయట గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు నోరుపారేసుకున్నారు. ఇంతలో తెల్ల టీషర్టు ధరించిన వ్యక్తి.. నీకు చేతనైతే నాపై దాడి చేయి అంటూ సవాలు విసిరాడు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన నిందితుడు తన వద్ద ఉన్న కత్తి తీసుకుని అతడిని పొడిచేశాడు(Stab). బాధితుడు పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేస్తూ నెలకొరిగాడు. వెంటనే బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా ఉపయోగం లేకపోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. వారిద్దరినీ నిలువరించేందుకు తాను ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయిందని షాపులోని ఉద్యోగి మీడియాకు తెలిపాడు. ‘‘ఇంత చిన్న విషయంపై గొడవ పడటం తగదు. కత్తి పక్కకు పెట్టేయ్ అని పలుమార్లు చెప్పా. కానీ.. అతడు వినలేదు.. నా ప్రయత్నం వృథా అయిపోయింది’’ అని అతడు వ్యాఖ్యానించాడు. నిందితుడు అక్కడకు ఆహారం డెలివరీ చేసేందుకు వచ్చి ఉంటాడని ఆయన తెలిపాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం.

Updated Date - 2022-09-23T02:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising