ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

George Floyd హత్య కేసులో US జిల్లా కోర్టు జడ్జి సంచలన తీర్పు

ABN, First Publish Date - 2022-07-08T14:06:49+05:30

జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో అమెరికా మాజీ పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌కు 20 ఏళ్లకు పైగా జైలు శిక్షను కోర్టు తాజాగా విధించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ పోలీసుకు 20 ఏళ్ల జైలు

మిన్నియాపాలిస్(అమెరికా):జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో అమెరికా మాజీ పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌కు 20 ఏళ్లకు పైగా జైలు శిక్షను కోర్టు తాజాగా విధించింది.2020వ సంవత్సరం మే నెలలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు సంబంధించి డెరెక్ చౌవిన్ ఇప్పటికే ఇరవై రెండున్నరేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.శ్వేతజాతీయుడైన చౌవిన్  2021వ సంవత్సరం డిసెంబరులో 46 ఏళ్ల నల్లజాతి వ్యక్తి ఫ్లాయిడ్ పౌర హక్కులను ఉల్లంఘించానని నేరాన్ని అంగీకరించాడు.జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఘటనపై యునైటెడ్ స్టేట్స్ అంతటా పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా నిరసనలు రేకెత్తాయి. ఫ్లాయిడ్ హత్య ఆరోపణలపై నేరారోపణ చేసిన తర్వాత చౌవిన్ ఇప్పటికే ఇరవై రెండున్నరేళ్ల శిక్షను అనుభవిస్తున్నాడు.


రాష్ట్ర, సమాఖ్య శిక్షలు ఏకకాలంలో అమలు చేయనున్నారు. 46 ఏళ్ల చౌవిన్ తన శిక్షా కాలాన్ని మిన్నెసోటా స్టేట్ పెనిటెన్షియరీలో కాకుండా ఫెడరల్ జైలులో అనుభవించడానికి అనుమతించారు.జైలులో చౌవిన్ ను ఏకాంత నిర్బంధంలో ఉంచారు. ‘‘నువ్వు ఎందుకు చేశావో నాకు తెలియదు" అని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి పాల్ మాగ్నుసన్ శిక్షను ప్రకటిస్తూ వ్యాఖ్యానించారు.‘‘కానీ ఓ వ్యక్తి చనిపోయే వరకు మీ మోకాలిని అతని మెడపై ఉంచడం తప్పు’’ అని జడ్జి చెప్పారు. 

Updated Date - 2022-07-08T14:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising