ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సముద్రంలో కుప్పకూలిన విమానం.. 8 మంది ప్రయాణికులు గల్లంతు

ABN, First Publish Date - 2022-02-15T18:50:00+05:30

అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్త్ కరోలినా: అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 8 మందితో ప్రయాణిస్తున్న చిన్న విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కుప్పకూలింది. నార్త్ కరోలినా రాష్ట్రం ఔటర్ బ్యాంక్స్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పటివరకు ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం 1.35 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) హైడ్ కౌంటీ ఎయిర్​పోర్ట్ నుంచి పిలాటస్ పీసీ-12/47 అనే సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్​ అయింది. అయితే, టేకాఫ్ అయిన 25 నిమిషాల తర్వాత రాడార్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. దాంతో విమానం సముద్రంలో కూలిపోయిందని నిర్ధారించుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. బోట్స్, హెలికాప్టర్లను రంగంలోకి దించి ముమ్మరంగా గాలించింది. ఆ క్రమంలో సముద్రంలో మూడు వేర్వేరు చోట్ల విమాన శకలాలు దొరికాయి. అక్కడే కోస్ట్ గార్డ్ సిబ్బంది ఒక మృతదేహాన్ని కూడా గుర్తించింది. కాగా, విమానంలోని 8 మందిలో ఎవరూ బతికి బయటపడే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. ప్రయాణికులందరూ కార్​టెరెట్ కౌంటీకి చెందినవారని సమాచారం. 

Updated Date - 2022-02-15T18:50:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising