ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రక్కును ఢీ కొట్టిన ఫ్లైట్.. పైలట్ మృతి

ABN, First Publish Date - 2022-02-18T18:19:50+05:30

ట్రక్కును ఫ్లైట్ ఢీ కొట్టిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విమానం పైలట్ అక్కడికక్కడే మృతి చెందగా.. ట్రక్కు డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ట్రక్కును ఫ్లైట్ ఢీ కొట్టిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విమానం పైలట్ అక్కడికక్కడే మృతి చెందగా.. ట్రక్కు డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రెండు ఇంజన్లు గల బ్రీచ్‌క్రాఫ్ట్ బ్యార్రెన్ ప్లేన్.. నార్త్ కరోలినాలోని డేవిడ్ కౌంటీ ఎయిర్‌పోర్టు నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు టేకాఫ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అదుపుతప్పి ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ట్రక్కు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని అధికారులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పైలట్‌ను రేమండ్ జాన్ అక్లీ(43)గా గుర్తించారు. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 




Updated Date - 2022-02-18T18:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising