ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటా.. పోలీస్ అధికారి సహా ఇద్దరు మృతి!

ABN, First Publish Date - 2022-03-09T21:59:22+05:30

అగ్రరాజ్యంలో అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిస్సోరీ: అగ్రరాజ్యంలో అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిస్సోరీ రాష్ట్రంలోని జాప్లిన్​ నగరంలో మంగళవారం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో జాప్లిన్ పోలీస్ అధికారి సహా ఓ దుండగుడు మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జాప్లిన్ అసిస్టెంట్​ పోలీస్​ చీఫ్​ బ్రియాన్ లూయిస్​ తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) నార్త్​పార్క్​ క్రాసింగ్​ షాపింగ్​ సెంటర్‌లోని ఓ స్టోర్​ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది.


దాంతో జాప్లిన్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలో దుండగుడు పోలీసులపై కాల్పులకు తెగపడ్డాడు. దీంతో ఇద్దరు పోలీసు అధికారులకు తూటాలు తగిలాయి. అనంతరం దుండగుడు పోలీస్ వాహనంలో అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. కొద్ది దూరం వెళ్లాక పోలీస్ వాహనాన్ని వదిలేసి పరుగు మొదలెట్టాడు. ఇది గమనించిన పోలీసులు దుండగుడిని వెంబడించారు. సెంట్రల్​ జోప్లిన్​ ప్రాంతంలోకి చేరుకోగానే ఓ అధికారి.. దుండగుడిపై కాల్పులు జరిపారు. దీంతో దుండగుడు కుప్పకూలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.      

Updated Date - 2022-03-09T21:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising