ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలోని కరోనా వైరస్‌లలో ఆ వేరియంట్ వాటానే అత్యధికం...

ABN, First Publish Date - 2022-07-27T05:02:55+05:30

అమెరికాలో గతవారం వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్‌లలో ఒమైక్రాన్ ఉపవేరియంట్ బీఏ.5 వాటా 81.9 శాతం ఉందని అంటువ్యాధుల నియంత్రణ సంస్థ మంగళవారం నాడు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో గతవారం వ్యాప్తిలో ఉన్న కరోనా(Corona) వైరస్‌లలో ఒమైక్రాన్(Omicron) ఉపవేరియంట్ బీఏ.5 వాటా 81.9 శాతం ఉందని అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(USCDC) మంగళవారం నాడు ప్రకటించింది. బీఏ.5 వేరియంట్ వ్యాప్తి 75.9 శాతం ఉండొచ్చన్న మునుపటి అంచనాకంటే ఇది ఎక్కువని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల వెనుక ఒమైక్రాన్ బీఏ.5 వేరియంట్ కారణమని ఇటీవలే తేలింది. అంతేకాకుండా.. కరోనా బారినపడి కోలుకోవడం లేదా టీకా తీసుకోవడం ద్వారా వృద్ధి చెందిన రోగనిరోధక శక్తి నుంచి కూడా తప్పించుకోగల సామర్థ్యం ఈ ఉపవేరియంట్‌కు ఉన్నట్టు బయటపడింది. మరోవైపు.. ఒమైక్రాన్ బీఏ.4 ఉపవేరియంట్ వ్యాప్తి స్థాయి 12.9 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే.. 50 ఏళ్లు పైబడిన వారందరూ కరోనా టీకా బూస్టర్ డోసు వేయించుకోవాలని సూచించారు. అంతేకాకుండా.. త్వరలో ఒమైక్రాన్ కట్టడి కోసం అందుబాటులోకి వచ్చే టీకాకు కూడా బూస్టర్‌డోసు తీసుకున్న వారు అర్హులేనని చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి అనవసర సందేహాలు వద్దని భరోసా ఇచ్చారు. 

Updated Date - 2022-07-27T05:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising