ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pilot jumps off plane: విమానం ల్యాండవుతుండగా కిందకు దూకేసిన పైలట్..

ABN, First Publish Date - 2022-07-31T22:58:54+05:30

అమెరికాలోని నార్త్‌ కెరొలీనా రాష్ట్రానికి చెందిన ఓ యువ పైలట్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలోని నార్త్‌ కెరొలీనా(North carolina) రాష్ట్రానికి చెందిన ఓ యువ పైలట్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టేకాఫ్ సమయంలో విమానంలోనే ఉన్న పైలట్..  ల్యాండయ్యే సమయానికి కనిపించకుండాపోయాడు. అతడితో పాటూ బయలుదేరిన సహ పైలట్ ఒక్కరే విమానాన్ని ఎయిర్‌పోర్టులో దించేశారు. విమానం కిందకు దిగే సమయంలోనే ఆ పైలట్ కిందకు దూకేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి మృత దేహం చెట్లల్లో చిక్కుకుని కనిపించింది. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


రాల్యీ డర్హమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Rayleigh durham International Airport) శుక్రవారం మధ్యాహ్నం ఓ విమానం అత్యవసరంగా ల్యాండైంది. కుడివైపున ఉన్న విమాన చక్రం ఊడిపోవడంతో ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దిగిపోవాల్సి వచ్చింది. అయితే.. విమానం టేకాఫ్ సమయంలో ఇద్దరు పైలట్లు ఉండగా.. దిగే సమయంలో మాత్రం ఒక్కరే మిగిలారు. అనూహ్యంగా ఇలా గల్లంతైన పైలట్.. ఎయిర్‌పోర్టుకు ముప్ఫై మైళ్ల దూరంలో చెట్లలో చిక్కుకుని కనిపించాడు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.  పైలట్ కింద పడిన సమయంలో తమకు శబ్దం వినిపించిందని స్థానికులు కొందరు తెలిపారు. తాము బయటకు వెళ్లి చూడగా.. అక్కడ ఎవరూ కనిపించలేదన్నారు. దీంతో..తాము స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వగా వారు గాలింపు చర్యలు చేపట్టి పైలట్ మృతదేహాన్ని కనుగొన్నారని చెప్పారు.


మృతుడిని ఛార్ల్స్ హ్యూ కుక్‌గా అధికారులు గుర్తించారు. విమానం ల్యాండయ్యే సమయంలోనే చార్ల్స్ కిందకు దూకేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు అతడు కిందకు పడిపోయి ఉండొచ్చని కూడా అధికారులు అనుమానిస్తున్నారు. ఇక విమానాన్ని అత్యవసరంగా దించిన రెండో పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స అనంతరం అతడు డిశ్చార్జ్ అయ్యాడు. అతడి వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఈ విమానం రామ్‌పార్ట్ ఏవియేషన్ సంస్థకు చెందినదని తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనపై రామ్‌పార్ట్ ఏవియేషన్ ఇంకా స్పందించలేదు. విమానంలోని సిబ్బంది అందరికీ పారాషూట్లు అందుబాటులోకి ఉన్నాయా లేదా అన్న దానిపై కూడా స్పష్టత రాలేదు. పైలట్ మృతికి గల కారణాలేంటో తేల్చేందుకు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు ప్రారంభించింది. ఛార్ల్స్ కుక్ మరణంతో అతడి కుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది. పైలట్ అవ్వాలని కలలుకన్న ఛార్ల్స్ ఇలా అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడంటూ అతడి తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. 

Updated Date - 2022-07-31T22:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising