ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cruel Husband: విడాకులు అడిగిన భార్యకు 30 కత్తిపోట్లు.. ఇలా ఎందుకు చేశావని అడిగితే.. మైండ్ బ్లాంక్ అయిందంటూ..

ABN, First Publish Date - 2022-08-04T17:39:55+05:30

అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ వేగాస్‍లో (Las Vegas) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాస్ వేగాస్‍లో‌: అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ వేగాస్‍లో (Las Vegas) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. విడాకులు కావాలని అడిగిన భార్యపై మృగంలా విరుచుకుపడ్డాడు. కత్తితో విచక్షణారహితంగా 30 సార్లు పొడిచాడు. శనివారం ఈ ఘటన జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు (Police) వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు క్లిఫర్డ్ జాకబ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. సడెన్‌గా భార్య వచ్చి విడాకులు కావాలని అడగడంతో తన మైండ్ బ్లాంక్ అయిందని, దాంతో ఆ సమయంలో ఏం చేశానో కూడా తెలియలేదంటూ పోలీసులతో నిందితుడు చెప్పాడు. తీరా తేరుకుని చూసే సరికి ఆమె రక్తపుమడుగులో పడి ఉన్నట్లు జాకబ్ పోలీసులకు వివరించాడు. నిందితుడి ఇంట్లో ఐదు కత్తులు, రక్తపు మరకలు ఉన్న కత్తెర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె మెడ, ముఖంపై కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-08-04T17:39:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising